Share News

Viral Video: అమ్మవారి అలంకరణలో పసికూన.. వైరల్ వీడియో

ABN , Publish Date - Oct 18 , 2024 | 05:43 PM

హిందువులందరికీ దసరా అతిపెద్ద పండుగ. దుర్గామాత తొమ్మిది రూపాలను గౌరవిస్తూ, దేవతను ఆరాధిస్తూ 9 రోజుల పాటు పండుగను జరుపుకుంటారు. ఆ రోజు ఆడపిల్ల పుడితే ఎంతో అదృష్టంగా భావిస్తారు.

Viral Video: అమ్మవారి అలంకరణలో పసికూన.. వైరల్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: హిందువులందరికీ దసరా అతిపెద్ద పండుగ. దుర్గామాత తొమ్మిది రూపాలను గౌరవిస్తూ, దేవతను ఆరాధిస్తూ 9 రోజుల పాటు పండుగను జరుపుకుంటారు. ఆ రోజు ఆడపిల్ల పుడితే ఎంతో అదృష్టంగా భావిస్తారు. దుర్గాష్టమి రోజు ఓ మహిళకు ఆడపిల్ల జన్మించింది. ఆమె ఆసుపత్రిలో ఉండగానే పసికూనను దుర్గామాతలా తయారు చేశారు. అనంతరం పాప తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల దగ్గరికి తీసుకెళ్లారు. ఆమెను చూసి వారి కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో ఉన్న వివరాల ప్రకారం.. ఒక వైద్యురాలు నవజాత శిశువును దుర్గమాతలా తయారు చేశారు. సంప్రదాయ ఎరుపు దుస్తులను ఆమెకు వేసి, తలపై దుర్గా దేవిలా పోలి ఉండేలా ఓ చిన్న కిరీటాన్ని పెట్టారు. పాపను చూడగానే కుటుంబసభ్యులు చిరునవ్వులు చిందిస్తూ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.


నెటిజన్లు సైతం ఆ చిన్నారిని చూసి ఫిదా అయ్యారు. “విజయదశమి నాడు పుట్టిన ఆడబిడ్డను ఎలా స్వాగతించారో చూడండి... లేడీ డాక్టర్ ఆమెను దుర్గా మాతగా అలంకరించారు. చూడముచ్చటగా ఉంది” అని ఒకరు, తాను చూసిన అందమైన దృశ్యాలలో ఇదీ ఒకటని మరొకరు కామెంట్ చేశారు. "ఇది ఒక అందమైన దృశ్యం, చాలా గర్వంగా ఉంది" అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. “విజయదశమి నాడు జన్మించిన ఆడపిల్లకు స్వాగతం పలికారు. ఈ ఆలోచనా విధానం చాలా ముఖ్యం” అని మరో నెటిజన్ అన్నాడు. అయితే చీరతో చిన్నారికి అసౌకర్యంగా ఉంటుందని మరొకరు అభిప్రాయపడ్డారు. కాగా నవరాత్రి పండుగను చెడుపై మంచి సాధించిన విజయంగా జరుపుకుంటారు. శ్రీ రామచంద్రుడు ఆ రోజునే రావణుడిని చంపాడని హిందువుల నమ్మకం. తద్వారా ప్రతి సంవత్సరం రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేసే సంస్కృతి వచ్చింది. మరోవైపు, దుర్గాదేవి... మహిషాసురుడు అనే రాక్షసుడి నవరాత్రులు పోరాడిందని చెబుతారు. విజయదశమి నాడు(10వ) రాక్షసుడిని చంపినట్లు పురాణాల్లో ఉంది.

Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్రలో బిగ్ ట్విస్ట్.. భారత 'రా' అధికారిపై అమెరికా అభియోగాలు..

Updated Date - Oct 18 , 2024 | 05:43 PM