Share News

Viral Video: వామ్మో.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఏసీ పేలిపోతుందా?.. పంజాబ్‌లో షాకింగ్ ఘటన!

ABN , Publish Date - Jun 01 , 2024 | 05:00 PM

ప్రస్తుతం వేసవి తీవ్రత ఓ రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా ఉత్తరాదిన వేసవి మంటలు భయంకర పరిస్థితులు సృష్టిస్తున్నాయి. రాజస్థాన్‌లోని చురులో, హర్యానాలోని సిర్సాలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటేశాయి. ఇక, దేశ రాజధాని డిల్లీలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 9 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

Viral Video: వామ్మో.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఏసీ పేలిపోతుందా?.. పంజాబ్‌లో షాకింగ్ ఘటన!
AC caught fire

ప్రస్తుతం వేసవి (Summer) తీవ్రత ఓ రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా ఉత్తరాదిన వేసవి మంటలు భయంకర పరిస్థితులు సృష్టిస్తున్నాయి (Temperature in North India). రాజస్థాన్‌లోని చురులో, హర్యానాలోని సిర్సాలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటేశాయి. ఇక, దేశ రాజధాని డిల్లీలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 9 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించకునేందుకు చాలా మంది ప్రజలు ఏసీలను ఆశ్రయిస్తున్నారు. మండే ఎండలో ఏసీ (AC) గదుల్లో కూర్చుని సేద తీరుతున్నారు. అయితే తాజాగా పంజాబ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది (Viral Video).


మండే ఎండలో ఏసీని ఆన్ చేసి ఉంచడం వల్ల ప్రమాదం సంభవించింది. పంజాబ్‌లోని రోపర్‌లో ఓ ఇంటి మేడ మీద అమర్చిన ఏసీ అవుట్ డోర్ యూనిట్ నుంచి మంటలు బయటకు వచ్చాయి. ఓ వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఏసీ ఇన్‌స్టాలేషన్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఎండ వేళల్లో ఈ జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలకు దూరంగా ఉండండి.


ఎండ నేరుగా పడేలా కాకుండా కాస్త నీడ ఉండే స్థలంలో ఏసీ అవుట్ డోర్ యూనిట్‌ను అమర్చుకోండి. మధ్యాహ్నం వేళ ఏసీ వేసుకోవాలనుకుంటే గంట, గంటన్నరకు మంచి ఆన్‌‌‌లో ఉంచకండి. ఆ సమయంలో ఏసీ‌లో టెంపరేచర్‌ను 27కు పైన పెట్టుకోండి. అలాగే ఏసీకి కచ్చితంగా స్టెబిలైజర్‌ను పెట్టుకోండి. స్టెబిలైజర్ లేకపోతే అవుట్ డోర్ యూనిట్‌కు ఒక్కోసారి ఎక్కువ కరెంట్ వెళ్లిపోతుంది. ఫలితంగా ప్రమాదాలు సంభవిస్తాయి.

ఇవి కూడా చదవండి..

Viral: పదో తరగతి పాస్ అయినందుకు ఊరేగింపు.. గ్రామస్థులు అంత ఆనంద పడడం వెనుక కారణం తెలిస్తే..


Puzzle: మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలోని తప్పును కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 01 , 2024 | 06:53 PM