Disembowelment: ఒకేసారి తుమ్ము, దగ్గు రావడంతో.. పొట్ట పగిలి బయటకొచ్చేసిన పేగులు!
ABN , Publish Date - Jun 07 , 2024 | 10:00 PM
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందని ఓ వృద్ధుడు ఊహించని ప్రమాదంలో పడ్డారు. ఓ రెస్టారెంట్‌లో ఆయన భోం చేస్తుండగా దగ్గు, తుమ్ము వచ్చాయి. ఈ క్రమంలో పొట్ట చిట్లడంతో పెగులు బయటకు వచ్చాయి. చివరకు వైద్యులు వృద్ధుడికి ఆపరేషన్ చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందని ఓ వృద్ధుడు ఊహించని ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఓ రెస్టారెంట్‌లో ఆయన భోజనం చేస్తుండగా దగ్గు, తుమ్ము వచ్చాయి. ఈ క్రమంలో పొట్ట చిట్లడంతో పెగులు బయటకు వచ్చాయి. తీవ్ర నొప్పితో విలవిల్లాడుతున్న వృద్ధుడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆపరేషన్ చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్ (Viral) అవుతోంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, వృద్ధుడికి అంతకుమునుపే ఉదరభాగంలో ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ సందర్భంగా వైద్యులు చిన్న కోత పెట్టి ఆ తరువాత కుట్లు వేశారు. అయితే, కుట్లు ఇంకా పూర్తిగా మానలేదు. ఈ క్రమంలో వృద్ధుడు ఓ రెస్టారెంట్ లో తింటుండగా ఉదరభాగంలో ఏదో తడిగా అనిపించింది. ఏం జరిగిందా అని చూసుకునే లోపే ఆయనకు దగ్గు, తుమ్మూ రావడంతో కుట్లు తెగిపోయి పోట్ట చిట్లి పేగులు బయటకు వచ్చేశాయి. నొప్పి తాళలేక అల్లాడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు మళ్లీ ఆపరేషన్ చేసి పరిస్థితిని చక్కదిద్దారు (Florida Man intestines explodes shoots out of his stomach).
Viral: జిమ్‌లో చోరీ చేస్తూ పట్టుబడ్డ దొంగ! ఓనర్ ఎలాంటి శిక్ష వేశాడో తెలిస్తే..
ఉదరం, పొత్తికడుపు భాగంలో ఆపరేషన్ చేసిన చోట గాయం పూర్తిగా మానని సందర్భాల్లో ఇలా జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ఇంగ్లిష్ లో డిస్‌ఎంబొవల్మెంట్ అంటారు. ఇలా జరిగినప్పుడు పొట్టలోంచి బయటపడ్డ భాగాలకు ఇన్ఫెక్షన్ సోకి చివరకు రోగి మరణించే అవకాశం కూడాఉందని చెబుతున్నారు. ఉదర భాగంలో ఆపరేషన్లు చేయించుకున్న వారు దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆపరేషన్ తాలూకు గాయాలు మానిందీ లేనిదీ నిత్యం గమనిస్తూ ఉండాలని, గాయం మానకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.