Delhi: ఢిల్లీని ‘చెత్త’ అన్న వ్యక్తిని పొగిడేస్తున్న భారతీయులు.. కారణం తెలిస్తే శెభాష్ అంటారు
ABN , Publish Date - Nov 14 , 2024 | 02:57 PM
ఓ పక్క ఢిల్లీ కాలుష్యం ఆందోళన కలిగిస్తుంటే మరో పక్క అక్కడి మహిళలకు రక్షణ కరువై అక్కడి పరిస్థితులు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ నిజమైన రూపాన్ని గుర్తుచేసి ఓ విదేశీయుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఢిల్లీ: తాను చూసిన ప్రదేశాల్లోకెల్లా ఢిల్లీ చాలా చెత్త ప్లేస్ అని ఓ విదేశీయుడు చేసిన రీల్ వైరలవుతోంది. సీన్ హమ్మండ్ అనే ఐరిష్ పర్షియన్ వ్లాగర్ ఢిల్లీ నగరంలో నివసించిన తన అనుభవాన్ని వివరిస్తూ సుదీర్ఘ పోస్టును పంచుకున్నాడు. ఢిల్లీ గురించి కొందరు మాట్లాడుతూ ఇది చాలా డేంజరస్ ప్లేస్ అని ఎక్కడ చూసినా మురికి చెత్తతో నిండి అపరిశుభ్రంగా ఉంటుందని అనడం తాను విన్నట్టు తెలిపాడు. అయితే, ఈ వాదలనతో తాను ఏమాత్రం ఏకీభవించనన్నాడు. ఢిల్లీలో ఉండేందుకు కొన్ని సవాళ్లను అధిగమించాల్సి రావడం నిజమే. కానీ, ఇక్కడి ప్రత్యేకత వేరు. దానిని కచ్చితంగా ఆస్వాదించి తీరాలి అంటూ సీన్ పేర్కొన్నాడు.
ఇక్కడ ఎంతో మంది భారతీయుల మధ్య నేను ఉన్నాను. వారు నన్నెంతో ప్రేమతో అక్కున చేర్చుకున్నారు. వారి స్నేహితులు, కుటుంబాలకు నన్ను పరిచయం చేశారు. వారి ఇళ్లకు ఆహ్వానించారు. ఫలితంగా వారు నా నుంచి ఏమీ ఆశించలేదు. ఇదొక్కటే కాదు ఢిల్లీలోని రంగు రంగుల అందమైన వీధులు ఇక్కడి శిల్పకళా నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అక్షర్ ధామ్ వంటి నిర్మాణం నీ జీవితంలోనే చూడలేదు. వీటన్నింటినీ మనసుతోనే చూడగలం అంటూ తెలిపాడు.
భారత్ లో తాను ఎక్కువసార్లు చూసింది ఢిల్లీ మాత్రమేనని తాను ఇక్కడ ఎంతో సుఖంగా ఉన్నట్టు తెలిపాడు. వీటన్నింటి ముందు కాలుష్యం అనే మాట చాలా చిన్నది. ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులు కాస్త గందరగోళంగా ఉన్న మాట వాస్తవమే. కానీ, నేను దాన్నే ప్రేమిస్తున్నాను. మీరు ఇప్పటివరకు ఇండియాలో కేరళ, గోవా, జైపూర్ వంటి ప్రదేశాలకు మాత్రమే వెళ్లి ఉంటే ఒకే. అవి చాలా అందంగా ఉంటాయి. కానీ 33 మంది మిలియన్లు నివసించే ఢిల్లీ లాంటి ఓ మెట్రో ప్రాంతంలో గడిపిన అనుభూతిని కూడా మీరు కచ్చితంగా ఒకసారి ప్రయత్నించాలి అంటూ తెలిపాడు. సీన్ రీల్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత్ గురించి ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్ ను సంపాదించుకుంది.