Share News

Viral Video: విచిత్రమైన ఫ్రెండ్‌షిప్.. కుక్క, పీత కలిసి ఏం చేస్తున్నాయో చూడండి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Dec 30 , 2024 | 05:34 PM

మనుషుల మధ్యనే కాదు.. వివిధ జాతులకు చెందిన జంతువుల మధ్య కూడా కొన్ని సార్లు స్నేహం కుదురుతుంది. అడవుల్లో నివసించే చాలా జంతువులు పరస్పరం స్నేహపూర్వకంగా మెలుగుతుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Viral Video: విచిత్రమైన ఫ్రెండ్‌షిప్.. కుక్క, పీత కలిసి ఏం చేస్తున్నాయో చూడండి.. వీడియో వైరల్..
Friendship video of puppy with the crab going viral

పవిత్రమైన స్నేహానికి (Friendship) కుల, మత బేధాలుండవు. ఆడ, మగ అనే తేడాలుండవు. మనుషుల మధ్యనే కాదు.. వివిధ జాతులకు చెందిన జంతువుల (Animals) మధ్య కూడా కొన్ని సార్లు స్నేహం కుదురుతుంది. అడవుల్లో నివసించే చాలా జంతువులు పరస్పరం స్నేహపూర్వకంగా మెలుగుతుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ కుక్క పిల్ల (Puppy), పీత (Crab) కలిసి ఆడుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి (Viral Video).


lingting.china అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల‌్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అందమైన తెలుపు రంగు కుక్కపిల్లతో ఓ పీత సన్నిహితంగా మెలుగుతోంది. ఆ కుక్క పిల్ల మీదకు ఎక్కింది. కుక్క పిల్ల బయటకు వెళ్లబోతుంటే పట్టుకుని ఆపుతోంది. ఆ రెండూ కలిసి ఇసుకలో సరదాగా సేద తీరుతున్నాయి. ఈ అరుదైన స్నేహాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేస్తున్నారు.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించి లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఇది చాలా విచిత్రమైన స్నేహం``, ``చాలా అందమైన వీడియో``, ``వారి మధ్య గొప్ప స్నేహం ఉన్నట్లుంది``, ``అది స్నేహం కాదు.. ఆ పీతకు కుక్క పిల్ల చిక్కింది``, ``కుక్క పిల్ల, పీత మధ్య స్నేహం అసాధ్యం. ఆ కుక్కపిల్ల చాలా అసౌకర్యంగా కనిపిస్తోంద``ని నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఎలక్ట్రిక్ వైర్లపై బట్టలు ఆరేస్తున్నాడు.. కిందనున్న వ్యక్తి అడిగితే ఏం చెప్పాడంటే..


Optical Illusion Test: మీ దృష్టికి సరైన పరీక్ష.. వీటిల్లో భిన్నంగా ఉన్న క్యాండీని 5 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: వధువు మెడలో దండ వేస్తుండగా షాకింగ్ సీన్.. వెనుక నుంచి వచ్చిన అమ్మాయి ఒక్క తన్ను తంతే..


Viral Video: హృదయ విదారకం.. కళ్ల ముందే చిన్నారి మాయం.. వరద నీటిలో ఎలా పడ్డాడో చూడండి..


Viral Video: వావ్.. పులులు కూడా ఇలా ప్రవర్తిస్తాయా? ఓ వ్యక్తి యాక్షన్‌కు పులి రియాక్షన్ చూస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 30 , 2024 | 05:34 PM