Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. వంట గదిలో పని చేసుకుంటుండగా పేలిన సిలిండర్.. అదృష్టం ఏంటంటే..
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:15 PM
గ్యాస్ స్టవ్‌ల మీద వంట చేసుకోవడం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అంతే ప్రమాదకరంగానూ ఉంటుంది. వంట అయిన తర్వాత గ్యాస్ స్టవ్, సిలిండర్ దగ్గర కట్టేసి ఉందో, లేదో చూసుకోవాలి. లేకపోతే భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పవు.
గ్యాస్ స్టవ్ (Gas stove)ల మీద వంట చేసుకోవడం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అంతే ప్రమాదకరంగానూ ఉంటుంది. వంట అయిన తర్వాత గ్యాస్ స్టవ్, సిలిండర్ (Gas cylinder) దగ్గర కట్టేసి ఉందో, లేదో చూసుకోవాలి. లేకపోతే భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పవు. గ్యాస్ సిలిండర్ పేలిందంటే నష్టం తీవ్రంగా ఉంటుంది (Gas cylinder explodes). ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే. ఓ మహిళ వంటింట్లో పని చేసుకుంటుండగా సిలిండర్ పేలిపోయింది (Viral Video).
@klip_ent అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ తన వంటింట్లో (Kitchen) పనులు చేసుకుంటోంది. పాత్రలు కడుగుతోంది. ఆ సమయంలో హఠాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఆ అదురుకు ఆ మహిళ కింద పడిపోయింది. వంట గదిలోని సామాన్లు కూడా చెల్లాచెదురుగా కిందపడిపోయాయి. ఆ మహిళ బిగ్గరగా అరుస్తూ బయటకు పారిపోయింది. గ్యాస్ సిలిండర్ పేలినా నష్టం తీవ్ర స్థాయిలో లేకపోవడానికి కారణం.. ఆ సిలిండర్‌లో గ్యాస్ చాలా తక్కువగా ఉండడమే.
అదే ఫుల్ సిలిండర్ అయి ఉంటే నష్టం ఊహించలేనంత తీవ్రంగా ఉండేది. ఈ ఘటన మొత్తం ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 1.34 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ మహిళ చాలా అదృష్టవంతురాలు``, ``గ్యాస్ తక్కువగా ఉంది కాబట్టి బతికిపోయింది``, ``పేలడానికి కారణం ఏంటి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Sunday Holiday: మన దేశంలో ఆదివారం సెలవు ఎలా వచ్చింది? 134 ఏళ్ల క్రితం ఉద్యమం ఎలా మొదలైందో తెలుసా?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..