Share News

Ghee: ముఖానికి నెయ్యి రాసుకోవడం మంచిదేనా? చర్మ సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారంటే..!

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:00 PM

నెయ్యి ఎన్నో ఏళ్ల నుండి ఆహారంలో భాగంగా ఉంది. ఆయుర్వేదం నెయ్యిని ఔషదంగా పరిగణిస్తుంది. ఎన్నో వంటలలోనూ, తీపి పదార్థాల తయారీలోనూ నెయ్యి తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అయితే నెయ్యిని కేవలం వంటలలో మాత్రమే కాదు.. చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తున్నారు. దీని గురించి చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Ghee: ముఖానికి నెయ్యి రాసుకోవడం మంచిదేనా? చర్మ సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారంటే..!

నెయ్యి ఎన్నో ఏళ్ల నుండి ఆహారంలో భాగంగా ఉంది. ఆయుర్వేదం నెయ్యిని ఔషదంగా పరిగణిస్తుంది. ఎన్నో వంటలలోనూ, తీపి పదార్థాల తయారీలోనూ నెయ్యి తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అయితే నెయ్యిని కేవలం వంటలలో మాత్రమే కాదు.. చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ, కె పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. నెయ్యిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. సరైన ఫలితాల కోసం నెయ్యిని ఎలా వాడాలి? దీని వల్ల కలిగే లాభాలేంటి? తెలుసుకుంటే..

ముఖానికి నెయ్యి రాసుకోవడం వల్ల చర్మం తేమగా మారి పొడి చర్మం సమస్య దూరమవుతుంది. ఇది చర్మానికి యాంటీ ఏజింగ్ గుణాలను కూడా అందిస్తుంది. అంతేకాదు నెయ్యి ఉపయోగించడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది.

పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకూడని పండ్లు ఇవీ..!


అరచేతికి 2 చుక్కల నెయ్యి రాసి ముఖానికి రాసుకోవాలి. వేళ్లతో కళ్ల కింద నెయ్యి రాసుకుంటే నల్లటి వలయాలు తగ్గుతాయి. చర్మం చాలా పొడిగా ఉంటే రాత్రి సమయంలో నెయ్యి రాసుకుని రాత్రంతా అలాగే ఉంచవచ్చు. సాధారణ చర్మం లేదా జిడ్డు చర్మం అయితే ముఖానికి నెయ్యి రాసుకుని 10-15 నిమిషాలు ఉంచుకుని ముఖం కడిగేయవచ్చు.

నెయ్యిని చర్మానికి అప్లై చేయడంతో పాటు ఫేస్ ప్యాక్‌ల తయారీలో కూడా ఉపయోగించవచ్చు. 2 చెంచాల శెనగపిండిలో ఒక చెంచా నెయ్యి వేసి అందులో కొన్ని చుక్కల పాలు వేయాలి. బాగా మిక్స్ చేసి ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై కనిపించే నల్లటి మచ్చలు తగ్గి చర్మం మెరుస్తుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!


నెయ్యితో మాయిశ్చరైజర్ కూడా తయారుచేసుకోవచ్చు. ప్రాచీనకాలం నుండి ఆయుర్వేదం చెప్పిన టిప్ ఇది. శుద్దమైన ఆవు నెయ్యిని తీసుకుని దాన్ని స్వచ్చమైన రాగి కంచంలో వేసి దాన్ని రాగి గ్లాసు లేదా కప్పు సహాయంతో బాగా మర్థన చేస్తారు. ఇలా చేసేటప్పుడు నీటిని జోడించి ప్రతి 60,70 సార్లకు నీటిని మారుస్తుంటారు. ఇలా 100సార్లు నీటిని మార్చుతూ నెయ్యిని శుద్ది చెయ్యడాన్ని శత ధౌత ఘృతం అని అంటారు. దీన్ని 100 టైమ్స్ వాష్డ్ ఘీ అని కూడా అంటారు. దీన్ని పురాతన కాలంలో రాణులు, ధనవంతులైన మహిళలు తమ అందం కోసం ఉపయోగించేవారని అంటారు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. జరిగేదిదే..!

మీకు నిద్రలో నరాలు లాగేస్తుంటాయా? అయితే ఈ సమస్యలున్నట్టే లెక్క ..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 24 , 2024 | 05:00 PM