Share News

Viral Video: ప్రయాణికులకు షాకింగ్ అనుభవం.. నడిరోడ్డుపై రాత్రిపూట రోడ్డుకు అడ్డంగా ఉన్న భారీ కొండచిలువను చూసి..

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:42 PM

పాములంటే భయపడని వారు చాలా అరుదుగా ఉంటారు. పాములున్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి చాలా మంది వణికిపోతారు. ఇక, కొండచిలువ పేరు వింటేనే భయపడే వారు ఎంతో మంది ఉంటారు. తాజాగా డెహ్రాడూన్‌లో కొందరు వాహనదారులకు షాకింగ్ అనుభవం ఎదురైంది.

Viral Video: ప్రయాణికులకు షాకింగ్ అనుభవం.. నడిరోడ్డుపై రాత్రిపూట రోడ్డుకు అడ్డంగా ఉన్న భారీ కొండచిలువను చూసి..
Giant python in Dehradun

సాధారణంగా వర్షాకాలంలో పాములు (Snakes) తమ నివాస ప్రాంతాల నుంచి జనావాసాల వైపు వచ్చేస్తుంటాయి. ఇళ్లలోకి దూరి సమస్యలు సృష్టిస్తుంటాయి. పాములంటే భయపడని వారు చాలా అరుదుగా ఉంటారు. పాములున్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా చాలా మంది వణికిపోతారు. ఇక, కొండచిలువ (Python) పేరు వింటేనే భయపడే వారు ఎంతో మంది ఉంటారు. తాజాగా డెహ్రాడూన్‌ (Dehradun)లో కొందరు వాహనదారులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా పొదల్లో నుంచి ఓ భారీ కొండచిలువ రోడ్డు (Road) పైకి వచ్చేసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@UttarakhandGo అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. డెహ్రాడూన్‌లోని సాంగ్ రివర్ బ్రిడ్జ్‌పై రాత్రి సమయంలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ సమయంలో పక్కన ఉన్న పొదల్లో నుంచి ఓ కొండచిలువ హఠాత్తుగా రోడ్డు పైకి వచ్చింది. అతి భారీగా ఉన్న ఆ కొండచిలువను చూసి ప్రయాణికులు తమ వాహనాలను ఆపేశారు. ఆ కొండచిలువ చాలా నెమ్మదిగా రోడ్డు దాటి అవతలి వైపునకు వెళ్లిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు నిశబ్దంగా అక్కడ నిల్చుని తమ మొబైల్ ఫోన్లతో వీడియోలు తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.1 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఆ వీడియోను దాదాపు రెండు వేల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నైట్ వాక్ కోసం బయటకు వచ్చింది``, ``దయచేసి డిస్ట్రబ్ చేయకండి``, ``వాళ్లు చాలా విజ్ఞతతో వ్యవహరించారు``, ``ఆ కొండచిలువ అప్పడే దేనినో మింగేసినట్టు ఉంది``, ``డెహ్రాడూన్‌లో చాలా కొండచిలువలు ఉంటాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వేటాడే ముందు పులి ఎంత సైలెంట్‌గా ఉంటుందో తెలుసా? ఈ వీడియోలో చిరుతల వేట చూస్తే..


Viral: నలుగురు భార్యలు, ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌.. ఈ జపాన్ వ్యక్తి టార్గెట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..


Viral: ఈ ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్యాసింజర్లకు కన్నడం ఎలా నేర్పుతున్నాడంటే..


Picture Puzzle: మీ ఐక్యూ లెవెల్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ఎన్ని పుచ్చకాయలు ఉన్నాయో చెప్పండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2024 | 01:42 PM