Share News

Viral Video: వామ్మో.. ఎవర్రా మీరంతా.. ప్రాణాలంటే లెక్క లేదా? రీల్ కోసం ఓ అమ్మాయి ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:36 PM

ఓ అబ్బాయి ఎత్తైన బిల్డింగ్ రూఫ్‌పైన పడుకుని ఉన్నాడు. ఓ అమ్మాయి అతడి చేయి పట్టుకుని అంత ఎత్తున గాల్లో వేలాడుతోంది. కింద పడిపోతున్న అమ్మాయిని ఆ అబ్బాయి కాపాడుతున్నట్టు ఆ సీన్ ఉంది. చూస్తుంటేనే కళ్లు తిరగడం ఖాయం. అలాంటిది ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో అని జాలి పడుతున్నారా?

Viral Video: వామ్మో.. ఎవర్రా మీరంతా.. ప్రాణాలంటే లెక్క లేదా? రీల్ కోసం ఓ అమ్మాయి ఏం చేసిందో చూడండి..
Girl Hanging for reel

ఓ అబ్బాయి ఎత్తైన బిల్డింగ్ రూఫ్‌పైన పడుకుని ఉన్నాడు. ఓ అమ్మాయి అతడి చేయి పట్టుకుని అంత ఎత్తున గాల్లో వేలాడుతోంది. కింద పడిపోతున్న అమ్మాయిని ఆ అబ్బాయి కాపాడుతున్నట్టు ఆ సీన్ ఉంది. చూస్తుంటేనే కళ్లు తిరగడం ఖాయం. అలాంటిది ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో అని జాలి పడుతున్నారా? అవసరం లేదు.. ఎందుకంటే కేవలం ఇన్‌స్టాగ్రామ్ రీల్ (Reel) కోసం ఆ అమ్మాయి తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ సాహసం (Stunt)చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).


@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ అమ్మాయి కోటలా కనిపిస్తున్న భవనం అంచు నుంచి వేలాడుతూ ఉంది. భవనంపై పడుక్కున్న ఉన్న ఓ అబ్బాయి ఆమె చేతిని పైనుంచి పట్టుకున్నాడు. ఆ అబ్బాయి చేయి పట్టుకున్న అమ్మాయి చక్కగా గాల్లో వేలాడుతోంది. ఆమెకు ఎలాంటి రక్షణా లేదు. పక్కనే ఉన్న వారి స్నేహితుడు వారి సాహసాన్ని వీడియో తీస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఈ వీడియోను ఇప్పటివరకు 1.6 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ``యాక్షన్ సినిమాల్లో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఇలాంటి స్టంట్లు చేస్తారు``, ``వీళ్లను చూస్తుంటే భయమేస్తోంది``, ``వీరిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలి``, ``తేడా జరిగితే ఎంతో విషాదం ఎదురుచూస్తుంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: గడ్డిలో దాక్కున్న పామును కనిపెట్టగలిగితే మీ దృష్టి అద్భుతంగా ఉన్నట్టు లెక్క..!


Viral Video: తల్లిని కాపాడుకునేందుకు ఏనుగుతో తలపడేందుకు సిద్ధమైన గేదె పిల్ల.. ఏం జరిగిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 21 , 2024 | 12:36 PM