Share News

Viral Video: ఈ అమ్మాయికి ఏమైంది? బిజీ రోడ్డు మీద బైక్ అలా నడుపుతోందేంటి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Dec 26 , 2024 | 03:17 PM

యువత బైక్ నడిపే విషయంలో ప్రాణాంతక సాహసాలు చేస్తుంటుంది. బైక్ నడిపే విషయంలో అబ్బాయిలే నిర్లక్ష్యంగా, అతి వేగంగా బైక్ నడుపుతారని అందరూ అనుకుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయంలో అమ్మాయిలు కూడా ఏమీ తీసిపోరని అర్థమవుతుంది.

Viral Video: ఈ అమ్మాయికి ఏమైంది? బిజీ రోడ్డు మీద బైక్ అలా నడుపుతోందేంటి.. వీడియో వైరల్..
Dangerous bike stunt

చాలా మంది రోడ్డు మీద ప్రయాణించేటపుడు ఎలాంటి నియమాలను పాటించరు. ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకుండా ప్రమాదకరంగా బైక్ (Bike) నడపుతుంటారు. ముఖ్యంగా యువత బైక్ నడిపే విషయంలో ప్రాణాంతక సాహసాలు చేస్తుంటుంది (Bike Stunt). బైక్ నడిపే విషయంలో అబ్బాయిలే నిర్లక్ష్యంగా, అతి వేగంగా బైక్ నడుపుతారని అందరూ అనుకుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆ విషయంలో అమ్మాయిలు కూడా ఏమీ తీసిపోరని అర్థమవుతుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@Decentladki1 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి బిజీ రోడ్డు మీద ప్రమాదకరంగా స్కూటీ నడుపుతోంది (Dangerous bike stunt). మొదట ఆమె తన రెండు మోచేతులను పూర్తిగా హ్యాండిల్‌ మీద ఆనించి వేగంగా బైక్ నడిపింది. ఆ తర్వాత ఆమె హ్యాండిల్‌ను పూర్తిగా వదిలేసి నడుము మీద చేతులు పెట్టి వెనుక సీటుపై పడుక్కుంది. ఆ తర్వాత పైకి లేచి బైక్ నడిపింది. ఆమె చేష్టలను కారులో వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. ``ఆమెకు పడిపోతుందని భయం లేదు`` అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 4.2 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఆ వీడియోను వందల మంది లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``ఆమె లైఫ్‌కి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉంది``, ``ఆమెకు ఫిజిక్స్ బాగా తెలుసనుకుంటా``, ``ఆమె బైక్ అనుకోవడం లేదు.. బెడ్ మీద ఉన్నట్టు బిహేవ్ చేస్తోంది``, ``ఆమె ఆ డ్రైవింగ్‌తో మరొకరిని చంపగలదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 15 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్ల పవర్ పీక్స్‌లో ఉన్నట్టే..


Santa Claus: శాంటా క్లాజ్ ఎక్కడ ఉంటాడు? అతడికి ఉత్తరాలు రాయాలంటే అడ్రస్ ఏంటి?


Viral Video: ఇది ఆల్టో కాదు.. మినీ థార్.. ఓ వ్యక్తి ఇంజినీరింగ్ ప్రతిభ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..


Picture Puzzle Test: ఈ ఫొటోలో తప్పేంటో 5 సెకెన్లలో కనిపెడితే.. మీ అబ్జర్వేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Viral Video: ఇది మామూలు ప్రాంక్ కాదు.. స్నేహితుడిని నమ్మినందుకు ఎలా మోసం చేశాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 26 , 2024 | 03:17 PM