Viral: సీఏ చదివిన యువకుడు.. బ్రేకప్ తరువాత గర్ల్‌ఫ్రెండ్‌కు భారీ షాకిచ్చాడుగా!
ABN , Publish Date - Jun 03 , 2024 | 08:47 PM
సీఏ చదివిన ఓ యువకుడు బ్రేకప్ తరువాత తన మాజీ గర్ల్ ఫ్రెండ్ కు భారీ షాకిచ్చాడు. అతడు చేసిన పనికి అవాక్కైన యువతి చివరకు తన బాధను స్నేహితురాలితో పంచుకుంది. చివరకు ఇది నెట్టింట బాట పట్టింది వైరల్ గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: సీఏ చదివిన ఓ యువకుడు బ్రేకప్ తరువాత తన మాజీ గర్ల్ ఫ్రెండ్ కు భారీ షాకిచ్చాడు. అతడు చేసిన పనికి అవాక్కైన యువతి చివరకు తన బాధను స్నేహితురాలితో పంచుకుంది. చివరకు ఇది నెట్టింట బాట పట్టింది వైరల్ గా (Viral) మారింది. తన ఫ్రెండ్‌కు ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ఎలాంటి షాకిచ్చింది చెబుతూ యువతి పెట్టిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
Viral Video: ఇంత జెలసీ ఎంట్రా బాబూ.. గజరాజుకు తోటి ఏనుగుల వేధింపులు!
యువతి తెలిపిన వివరాల ప్రకారం, ఆమె ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ తో ఇటీవలే విడిపోయింది. ఆ తరువాత అతడు ఊహించని పని చేశాడు. డేటింగ్ లో ఉండగా గర్ల్ ఫ్రెండ్ పై తాను చేసిన ఖర్చుల వివరాలన్నీ ఆమెకు పంపించాడు. ఏరోజు ఎంత ఖర్చుపెట్టిందీ ఎక్సెల్ షీట్ తయారు చేసి పంపించాడు. ఆ ఖర్చును చెరిసగం పంచుకోవాలని ఆమెకు చెప్పాడు. అంతేకాకుండా, ఆమె ఖర్చుపై జీఎస్టీ కూడా జత చేశాడు. మాజీ బాయ్ ఫ్రెండ్ లెక్కల చిట్టా చూసి యువతి షాకైపోయింది. చివరకు తన స్నేహితురాలి దగ్గర బావురుమంది. ఏడు నెలల డేటింగ్ లో రూ. 1,02,772 అందులో సగం మొత్తాన్ని జీఎస్టీ సహా కలిపి చెల్లించాలని అతడు డిమాండ్ చేశాడని పేర్కొంది (Girl receives bills from ex boyfriend with added gst after break up).
అయితే, సీఏ యువకుడు చేసిన పనిపై జనాలు పెదవి విరిచారు. కొందరు ట్రోలింగ్ కు కూడా దిగారు. మరీ చీప్ గా చేయకూడదని కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతి కొద్ది మంది మాత్రం యువకుడిని ప్రశంసించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఘటనపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఉదంతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది.