Viral Video: వివాహ వేడుకకు వచ్చిన సీతాకోక చిలుక.. గుక్కపెట్టి ఏడ్చిన వరుడు.. అసలు కథ ఏంటో తెలిస్తే..
ABN , Publish Date - May 12 , 2024 | 04:34 PM
పెళ్లి రోజు అనేది వధువుకైనా, వరుడికైనా చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోవాలని ఇద్దరూ కోరుకుంటారు. తమకు సన్నిహితులైన వారందరూ తమ వివాహ వేడుకకు హాజరు కావాలని కోరుకుంటారు. కొందరు తమ ప్రియమైన వారిని గుర్తుచేసుకుంటూ విచారంగా మారిపోతుంటారు.
పెళ్లి (Marriage) రోజు అనేది వధువుకైనా, వరుడికైనా చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోవాలని ఇద్దరూ కోరుకుంటారు. తమకు సన్నిహితులైన వారందరూ తమ వివాహ వేడుకకు హాజరు కావాలని కోరుకుంటారు. కొందరు తమ ప్రియమైన వారిని గుర్తుచేసుకుంటూ విచారంగా మారిపోతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఆ వీడియోలో వెడ్డింగ్ స్పీచ్ ఇస్తున్న వరుడు (Groom) ఉన్నట్టుండి బిగ్గరగా ఏడ్చేశాడు. ఓ సీతాకోకచిలుక (Butterfly) అతడిలో తీవ్ర భావోద్వేగాన్ని కలిగించింది (Viral Video).
shanghai_daily అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని వరుడు వెడ్డింగ్ స్పీచ్ ఇస్తున్నాడు. ఆ సమయంలో ఓ సీతాకోక చిలుక వచ్చి అతడి కోటు జేబుపై వాలింది. దీంతో అతడు తీవ్ర భావోద్వేగానికి గురై బిగ్గరగా ఏడ్చేశాడు. ఆ తర్వాత అసలు విషయం తెలిపాడు. ఆ యువకుడి అమ్మమ్మ గతేడాది మరణించింది. పెళ్లి కుదిరిన తర్వాత ఆ యువకుడు అమ్మమ్మ ఫొటో దగ్గర నిల్చుని.. `` నువ్వు నన్ను ప్రేమించి, గుర్తుంచుకుంటే నా పెళ్లి సమయానికి సీతాకోక చిలుకలా రా`` అని అన్నాడట.
వివాహ సమయంలో అలా సీతాకోక చిలుక రావడం కాకతాళీయమే అయినా వరుడు మాత్రం తన అమ్మమ్మను గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 8.5 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నాకు ఇప్పటికీ ఏడుపు వస్తోంది``, ``సీతాకోక చిలుక రావడం గొప్ప విశేషం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం.
ఇవి కూడా చదవండి..
Viral Video: నడిరోడ్డు మీద కార్తో ఛేజింగ్.. పంజాబ్లో ఓ మహిళకు భయంకర అనుభవం.. వీడియో వైరల్!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..