Viral Video: ఈ వీడియోలో నిజమైన జంతువు ఎవరు? ట్రాక్టర్ డ్రైవర్ ప్రవర్తనకు బిత్తరపోయిన ఏనుగులు..!
ABN , Publish Date - Jun 14 , 2024 | 04:52 PM
రోడ్లు వేసేందుకు అడవులను కొట్టేయడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైపోయింది. జాతీయ రహదారుల పేరుతో అడవుల మధ్య నుంచే రోడ్లు వేసేస్తున్నారు. దీంతో వన్య ప్రాణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోడ్లు దాటుతున్న సమయంలో ప్రమాదాలకు గురవుతున్నాయి.
రోడ్లు వేసేందుకు అడవులను (Forest) కొట్టేయడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైపోయింది. జాతీయ రహదారుల పేరుతో అడవుల మధ్య నుంచే రోడ్లు వేసేస్తున్నారు. దీంతో వన్య ప్రాణులు (Wild Animals) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోడ్లు దాటుతున్న సమయంలో ప్రమాదాలకు గురవుతున్నాయి. సాధారణంగా వన్య ప్రాణులు రోడ్డు దాటుతున్నప్పుడు వాహనదారులు కచ్చితంగా తమ వాహనాలను నిలిపి ఉంచాల్సిందేనని సూచనలు కనిపిస్తుంటాయి. అయినా కొందరు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు (Viral Video).
ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ తాజాగా షేర్ చేసిన ఓ వీడియో చూస్తే కోపం రాక మానదు. ఓ ట్రాక్టర్ డ్రైవర్ (Driver) అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి విమర్శల పాలవుతున్నాడు. ఈ వీడియోను ఝార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొన్ని ఏనుగులు (Elephants) వరుసగా రోడ్డు దాటుతున్నాయి. ఆ సమయంలో ఓ ట్రాక్టర్ వేగంగా అటు వైపు వెళుతోంది. ఏనుగులను చూసిన తర్వాత కూడా ఆ డ్రైవర్ వేగాన్ని తగ్గించలేదు. నేరుగా ముందుకు దూసుకెళ్లిపోయాడు. వేగంగా వస్తున్న ట్రాక్టర్‌ను చూసి ఏనుగులు భయపడి ఆగిపోయాయి.
ఆ వీడియోను షేర్ చేసిన పర్వీన్ కస్వాన్ ``ఈ వీడియోలోని నిజమైన జంతువులను గుర్తించండి. ఈ వీడియోను ఝార్ఖండ్‌లో చిత్రీకరించారు. అడవిలో ముందు వెళ్లే హక్కు కచ్చితంగా జంతువులదే అని గుర్తుంచుకోండి`` అని కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ``ఆ డ్రైవరే నిజమైన జంతువు``, ``కనీస మానవత్వం లేని ఆ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలి``, ``ఏమైనా తేడా జరిగితే పెద్ద ప్రమాదం జరిగుండేది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. అమ్మాయి తలలో పాము.. ఎలా కదులుతోందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్!
Puzzle: మీ ఐక్యూకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురిలో ఎవరు రోగిగా నటిస్తున్నారో చెప్పండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..