Share News

Viral: 10 నెలల్లో 23 కేజీలు తగ్గిన వ్యాపారి! అతడి టెక్నిక్ నెట్టింట వైరల్!

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:22 PM

బరువు తగ్గాలంటే జిమ్‌లకు వెళ్లి కసరత్తులు చేయాలి. డైట్ ప్లాన్ పేరిట రకరకాల తక్కువ కేలొరీల ఫుడ్ తినాలి. కానీ ఓ గుజరాతీ వ్యాపారి ఇవేమీ లేకుండానే 10 నెలల్లో ఏకంగా 23 కేజీల బరువు తగ్గాడు. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఆయన ఫాలో అయిన టెక్నిక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: 10 నెలల్లో 23 కేజీలు తగ్గిన వ్యాపారి! అతడి టెక్నిక్ నెట్టింట వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: బరువు తగ్గాలంటే జిమ్‌లకు వెళ్లి కసరత్తులు చేయాలి. డైట్ ప్లాన్ పేరిట రకరకాల తక్కువ కేలొరీల ఫుడ్ తినాలి. కానీ ఓ గుజరాతీ వ్యాపారి ఇవేమీ లేకుండానే 10 నెలల్లో ఏకంగా 23 కేజీల బరువు తగ్గాడు. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఆయన ఫాలో అయిన టెక్నిక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది. ఆ వ్యాపారి ఉదంతాన్ని సాతేజ్ గోహెల్ అనే ఫిట్నెస్ కన్సల్టెంట్ నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Shocking: 2038 జులై 12న మానవాళి అంతం.. భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలం!!

నీరజ్ అనే వ్యాపారి తన సలహాలతో ఎలా బరువు తగ్గిందీ సాతేజ్ నెట్టింట వివరించారు. నీరజ్‌ గతంలో ఎన్నడూ జిమ్‌కు వెళ్లలేదన్నాడు. బిజీ వ్యాపారి అయిన ఆయనకు కసరత్తులు చేసే తీరిక కూడా లేదన్నాడు. దాంతో తాను ఆయనకు ఇంట్లో చేసుకునేందుకు వీలైన కొన్ని కసరత్తులు, నడక చేయమని సూచించాని, వెజిటేరియన్ ప్రొటీన్ ఆహారం, చక్కెర లేకుండా మాత్రమే తినాలని చెప్పానని అన్నాడు (Gujarati Businessman Lost 23 Kg In 10 Months Without Gym Or Fancy Diet His Story Is Now Viral).


తొలుత రోజుకు 10 వేల అడుగులు వేసేందుకు ఇబ్బంది పడ్డ నీరజ్ ఆ తరువాత క్రమంగా ఈ షెడ్యూల్‌కు అలవాటు పడిపోయారని, క్రమం తప్పకుండా షెడ్యూల్ ఫాలో అవుతూ బరువు తగ్గారని వివరించాడు. ఒకప్పుడు 91.9 కేజీలున్న ఆయన ప్రస్తుతం 68.7 కేజీలకు తగ్గారని వివరించారు. తామిద్దరం ఓ టీం లాగా లక్ష్యం కోసం కష్టపడినందువల్లే ఇది సాధ్యమైందని అన్నారు.

నెటిజన్లకు ఈ ఉదంతం బాగా నచ్చడంతో ప్రస్తుతం నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తిండిపైనా, మనసుపైనా అదుపు ఉంటే బరువు సులభంగానే తగ్గొచ్చని ఈ ఇద్దరూ నిరూపించారంటూ పలువురు కామెంట్ చేశారు. అసాధారణ ఫీట్ సాధించారని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jun 24 , 2024 | 04:28 PM