Viral: రూ.45 వేల కరెంట్ బిల్! ఇక కాండిల్సే వాడతానంటూ కామెంట్! జరిగిందేంటంటే..
ABN , Publish Date - Jun 23 , 2024 | 06:55 PM
కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు దాటిందంటే గడగడలాడిపోయే వాళ్లున్న దేశంలో ఓ వక్తి తాను ఏకంగా రూ. 45 వేల కరెంట్ బిల్లు కట్టానని చెప్పడం నెట్టింట సంచలనంగా మారింది. నెట్టింట పెద్ద చర్చకు తెర తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు దాటిందంటే గడగడలాడిపోయే వాళ్లున్న దేశంలో ఓ వ్యక్తి తాను ఏకంగా రూ. 45 వేల కరెంట్ బిల్లు కట్టానని చెప్పడం నెట్టింట సంచలనంగా (Viral) మారింది. తాను కట్టిన బిల్లు స్క్రీన్ షాట్ కూడా ఆ వ్యక్తి షేర్ చేశాడు. గురుగ్రామ్‌లో బయటపడ్డ ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. జనాలు నోరెళ్ల బెట్టేలా చేస్తోంది.
Viral: కెనడాలో పరిస్థితి మరీ ఇంతలా దిగజారిందా? విద్యార్థుల కష్టాలు చూస్తే..
గురుగ్రామ్‌లో ఉండే సీఈఓ జస్వీర్ సింగ్ ఈ పోస్టు పెట్టారు. తాను రెండు నెలలకు కలిపి మొత్తం రూ. 45 వేల కరెంటు బిల్లు చెల్లించానని అన్నారు. అయితే, అంత బిల్లు ఎందుకు వచ్చిందీ, అతడు వాణిజ్య వినియోగదారుడా లేక డొమెస్టిక్ కనెక్షన్ ఉన్న వాడా అన్న వివరాలేవీ లేకపోయినప్పటికీ ఈ పోస్టు జనాలను విపరీంతగా ఆకర్షిస్తోంది. అంత పెద్ద మొత్తం చెల్లించాల్సి రావడం తనకు షాకిచ్చిందని చెప్పిన జస్వీర్ సింగ్ ఇకపై క్యాండిళ్లను వినియోగించడమే బెటరని తాను డిసైడ్ అయినట్టు చెప్పుకొచ్చాడు (Gurugram mans Rs 45k electricity bill will make you switch to candles as well ).
సహజంగానే ఈ పోస్టు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అతడు ఏయే ఎలక్ట్రిక్ వస్తువులను వాడుతున్నాడని అనేక మంది ప్రశ్నించారు. విద్యుత్ చార్జీల విషయంలో ప్రాంతాల వారీగా వ్యత్యాసాలు ఉన్నాయని కొందరు తెలిపారు. కొందరు మాత్రం సౌర విద్యుత్ వైపు మళ్లాలని కూడా సూచించారు. తాము సౌర విద్యుత్ వినియోగించడం మొదలెట్టాక విద్యుత్ బిల్లు దాదాపుగా సున్నాకు చేరుకుందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ పోస్టు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.