Anand Mahindra: ఈమె జీవితం స్ఫూర్తివంతం! భారత క్రీడాకారిణిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ABN , Publish Date - May 27 , 2024 | 04:22 PM
పసిడి పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించిన దీపా కర్మాకర్‌పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆమె ఈ ఘనత సాధించిందని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దీపా కర్మాకర్ (Dipa Karmakar) .. భారత క్రీడా ప్రపంచంలో ప్రస్తుతం మారుమోగిపోతున్న పేరిది. ఏషియన్ సీనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి జిమ్నాస్ట్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. కొంత కాలం క్రితమే మోకాలి గాయంతో ఆమె కెరీరే ప్రశార్థకంగా మారింది. అలాంటి పరిస్థితిని తట్టుకుని నిలబడ్డ దీప.. ఏకంగా పసిడి పతకం సాధించి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. ఇంతటి అరుదైన ఫీట్‌ను సాధించిన దీపాను ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తాజాగా ఎక్స్ వేదికగా నెట్టింట ఓ పోస్ట్ పెట్టారు. దీపా గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఉదతంతం వైరల్ (Viral) అవుతోంది.
Lungi: లండన్ వీధుల్లో లుంగీలో యువతి హల్‌చల్.. వైరల్ వీడియో
‘‘మార్చి లోనే దీపా కర్మాకర్ తన గాయం గురించి ప్రస్తావించింది. ఎన్ని అడ్డంకుల్ని అధిగమించిందీ చెప్పుకొచ్చింది. ఆటపై మమకారమే తనను ముందుకు నడిపించిందని పేర్కొంది. ఏషియన్ ఛాంపియన్‌షిప్ లో పసిడి గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఇలాగే ముందుకు దూసుకుకెళ్లాలని కోరుకుంటున్నా’’ అని మహీంద్రా పోస్ట్ పెట్టారు (Gymnast Dipa Karmakars success is Anand Mahindras Monday Motivation).
యావత్ దేశం గర్వించేలా పసిడి పతకం పొందేందుకు దీపా ఎన్నో అడ్డంకుల్ని అధిగమించాల్సి వచ్చింది. 2019లో బాకులో ప్రపంచకప్ సందర్భంగా ఆమెకు తీవ్ర గాయమైంది. గాయం కారణంగా ఒకానొక సందర్భంలో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఆ తరువాత కూడా పలు అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ ఆటపై మక్కువ ఆమెతో ధైర్యంగా ముందడుగు వేయించింది. తన పోస్టులో ఆనంద్ మహీంద్రా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ పోస్టుపై పెద్ద ఎత్తున స్పందిస్తున్న నెటిజన్లు దీప విజయం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రశంసించారు. ఆనంద్ మహీంద్రా పోస్ట్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.