Share News

hair Growth: జుట్టు మందంగా పెరగడానికి ఆయుర్వేదం చెప్పిన రహస్యం.. ఈ ఒక్క పొడి వాడి చూడండి..!

ABN , Publish Date - Jul 18 , 2024 | 12:40 PM

జుట్టు అందంగా, నల్లగా, ఒత్తుగా పెరగాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇప్పట్లో అలాంటి జుట్టు చాలా తక్కువ మందికి ఉంటోంది. ముఖ్యంగా గత 20,30 ఏళ్ల కిందట ఆడవాళ్లకు చాలా పొడవుగా, మందంగా ఉండే జుట్టు ఉండేది. ఇప్పుడు ఎన్ని రకాల ప్రోడక్ట్స్ వాడినా జుట్టు పెరగడం లేదు. కానీ..

hair Growth: జుట్టు మందంగా పెరగడానికి ఆయుర్వేదం చెప్పిన రహస్యం.. ఈ ఒక్క పొడి వాడి చూడండి..!

జుట్టు అందంగా, నల్లగా, ఒత్తుగా పెరగాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇప్పట్లో అలాంటి జుట్టు చాలా తక్కువ మందికి ఉంటోంది. ముఖ్యంగా గత 20,30 ఏళ్ల కిందట ఆడవాళ్లకు చాలా పొడవుగా, మందంగా ఉండే జుట్టు ఉండేది. ఇప్పుడు ఎన్ని రకాల ప్రోడక్ట్స్ వాడినా జుట్టు పెరగడం లేదు. దీనికి కారణం ఆయా ప్రోడక్స్ట్ లోని రసాయనాలే అని జుట్టు సంరక్షణ నిపుణులు అంటున్నారు. జుట్టు మందంగా, పొడవుగా పెరగాలంటే ఆయుర్వేదం సూచనలు పాటించాలి. కేవలం ఒకే ఒక్క పౌడర్ వాడితే చాలు.. జుట్టు బాగా మందంగా పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అదేంటో తెలుసుకుంటే..

Headache: వ్యాయామం తర్వాత మీకు తలనొప్పిగా ఉంటుందా? అసలు కారణాలు ఇవే..!



అతిమధురం..

ఆయుర్వేదంలో అతిమధురం ఒక గొప్ప మూలిక. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. అతిమధురం పొడిని వాడితే ఎంత పలుచగా ఉన్న జుట్టు అయినా తిరిగి మందంగా మారుతుందట. ఇందుకోసం అతిమధురం పొడిని కింది విధంగా ఉపయోగించాలి.

హెన్నాతో..

అతిమధురం పొడిని హెన్నాతో కలిపి జుట్టుకు పట్టించవచ్చు. దీనికోసం కావలసిన పదార్థాలు..

  • హెన్నా పౌడర్..

  • టీ డికాక్షన్..

  • అతిమధురం పొడి.. 4 స్పూన్లు

  • నీరు.. అవసరాన్ని బట్టి

  • పెరుగు.. 2స్పూన్లు.

ఈ ఆహారాలు తినండి చాలు.. నరాలు ఉక్కులా మారతాయి..!


తయారీవిధానం..

  • హెన్నా పౌడర్ లో టీ డికాక్షన్, అతిమధురం పొడి, నీరు, పెరుగు అన్ని వేసి బాగా కలిపి పేస్ట్ సిద్దం చేసుకోవాలి. దీన్ని గంట సేపు పక్కన పెట్టాలి. కావాలంటే రాత్రి మొత్తం అలాగే ఉంచవచ్చు.

  • గంట తరువాత హెన్నా పేస్ట్ ను జుట్టుకు అప్లై చేయాలి. దీన్ని 30నిమిషాలు అలాగే ఉంచుకోవాలి.

  • 30 నిమిషాల తరువాత షాంపూతో కాకుండా నీటితో మాత్రమే జుట్టును శుభ్రం చేసుకోవాలి. కేవలం ఒక్కసారి వాడటంతోనే దీంతో ఫలితాలు కనిపిస్తాయి. దీన్ని నెలకు రెండుసార్లు ఉపయోగించవచ్చు.

పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!

రాత్రిపూట చేసే ఈ పొరపాట్ల వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 18 , 2024 | 12:40 PM