Share News

Hair Spa Treatment: మృదువైన జుట్టుకోసం ఇంట్లోనే హెయిర్ స్పా ట్రీట్మెంట్.. ఇలా చేసేయండి..!

ABN , Publish Date - Jul 11 , 2024 | 08:32 AM

వర్షాకాలంలో వాతావరణం వల్ల జుట్టు రఫ్ గా మారిపోవడం, పొడిబారడం, వర్షంలో తడవడం వల్ల డ్యామేజ్ కావడం, చుండ్రు వంటి సమస్యలు వస్తాయి. వీటిని అరికట్టాలన్నా, జుట్టు మృదువుగా ఉండాలన్నా ఇంట్లోనే హెయిర్ స్పా లాంటి ట్రీట్మెంట్ జుట్టుకు ఇవ్వవచ్చు

Hair Spa Treatment: మృదువైన జుట్టుకోసం ఇంట్లోనే హెయిర్ స్పా ట్రీట్మెంట్.. ఇలా చేసేయండి..!

జుట్టు మృదువుగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే ఇది కాస్త అసాధ్యంలా అనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణం వల్ల జుట్టు రఫ్ గా మారిపోవడం, పొడిబారడం, వర్షంలో తడవడం వల్ల డ్యామేజ్ కావడం, చుండ్రు వంటి సమస్యలు వస్తాయి. వీటిని అరికట్టాలన్నా, జుట్టు మృదువుగా ఉండాలన్నా ఇంట్లోనే హెయిర్ స్పా లాంటి ట్రీట్మెంట్ జుట్టుకు ఇవ్వవచ్చు. దీనికి ఏమేం కావాలో.. ఇది ఎలా చేయాలో తెలుసుకుంటే..

ఆయిల్ మసాజ్..

హెయిర్ స్పా లాంటి ట్రీట్మెంట్ కోసం మొదట తలకు ఆయిల్ మసాజ్ చెయ్యాలి. దీనికోసం కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు నూనె బాగా పట్టేలాగా మసాజ్ చేయాలి. ఇది జుట్టు పొడిబారడాన్ని తొలగిస్తుంది.

రోజూ 15 నిమిషాలు వాకింగ్ చేస్తే ఈ 6 ప్రయోజనాలు మీ సొంతం..!


ఆవిరి పట్టాలి..

ఆయిల్ మసాజ్ చేసుకున్న తరువాత జుట్టుకు ఆవిరి పట్టాలి. ఇందుకోసం ఒక మందంపాటి టవల్ ను వేడినీటిలో ముంచి పిండేయాలి. వేడిగా ఉన్న టవల్ ను ఆయిల్ మసాజ్ చేసిన తలకు చుట్టాలి. ఇది జుట్టుకు ఆవిరి ఇస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

షాంపూ..

జుట్టుకు ఆవిరి పట్టిన తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఇది తలలో జిడ్డును తొలగించి తలను శుభ్రం చేస్తుంది.

ఖాళీ కడుపుతో గుమ్మడి గింజలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!


హెయిర్ మాస్క్..

తలస్నానం చేసిన తరువాత జుట్టును ఆరబెట్టాలి. జుట్టు ఆరిన తరువాత జుట్టుకు హెయిర్ మాస్క్ వెయ్యాలి. గుడ్డు లేదా కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్ ను ఇంట్లోనే తయారుచేసి వేసుకోవచ్చు. హెయిర్ మాస్క్ ను 15 నిమిషాలు అలాగే ఉంచి తరువాత కడిగేయాలి.

శుభ్రం..

హెయిర్ మాస్క్ వేసిన తరువాత జుట్టును శుభ్రంగా కడుక్కోవాలి. దీని తరువాత జుట్టు ఆరబెట్టడానికి ఎలాంటి హెయిర్ డ్రైయర్లు, స్ట్రైటనర్లు ఉపయోగించకూడదు. జుట్టు సహజంగా గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా మారడమే కాదు.. పట్టుకుచ్చులా మెరుస్తుంది కూడా. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో కూడా ఇది సహాయపడుతుంది. దీన్ని రెండు వారాలకు ఒకసారి లేదంటే నెలకు ఒకసారి ఫాలో కావచ్చు.

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల లిస్ట్ ఇదీ..!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏం జరుగుతుందంటే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 11 , 2024 | 08:32 AM