Viral Video: వడాపావ్ అమ్ముకునే వ్యక్తి అని చులకనగా చూడకండి.. అతడి నెల సంపాదన తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
ABN , Publish Date - Oct 09 , 2024 | 08:13 PM
మంచి ఉద్యోగాలు చేసే వారి కంటే రోడ్డు పక్కన సమోసాలు, బజ్జీలు అమ్ముకునే వ్యక్తులు ప్రస్తుతం ఉద్యోగస్తులను మించి సంపాదిస్తున్నారు. ముంబైలో రోడ్డు పక్కన చిన్న స్టాల్ పెట్టుకుని వడాపావ్ అమ్ముకుంటున్న వ్యక్తి నెలవారీ సంపాదన గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే.
కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తల్లిదండ్రులు కూడా అదే చెబుతుంటారు. అయితే కోరుకున్న ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. ఒకవేళ ఉద్యోగం సంపాదించినా, రాత్రి, పగలు కష్టపడి పని చేసినా అనుకున్నంత జీతం రాదు. ఒకవేళ భారీ జీతం పొందుతున్నట్టైతే అందుకు రెండింతలు పని చేయాల్సి ఉంటుంది. అయితే రోడ్డు పక్కన సమోసాలు, బజ్జీలు అమ్ముకునే వ్యక్తులు ప్రస్తుతం ఉద్యోగస్తులను మించి సంపాదిస్తున్నారు. ముంబైలో రోడ్డు పక్కన చిన్న స్టాల్ పెట్టుకుని వడాపావ్ (Vada Pav) అమ్ముకుంటున్న వ్యక్తి నెలవారీ సంపాదన గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే (Viral Video).
sarthaksachdevva అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్, బ్లాగర్ ఓ ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వడాపావ్ అనేది ముంబైలో చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. రోజుకు కేవలం 15 రూపాయలకే వడా పావ్‌లు విక్రయించే ఓ సాధారణ వీధి వ్యాపారి సంపాదన గురించి ఆ బ్లాగర్ ఓ వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందుకోసం రోజంతా ఆ స్టాల్ వద్దే గడిపారు. తాను వెళ్లిన స్టాల్ విక్రేత ఒక్కరోజులో 622 వడ పావ్‌లను విక్రయించినట్లు వీడియోలో ఆ బ్లాగర్ చెప్పాడు. ఒక్కో వడ పావ్ ధర రూ.15గా పరిగణిస్తే ఒక్క రోజులో అతని మొత్తం సంపాదన రూ.9300. అంటే నెలలో 30 రోజులు అదే తరహాలో పని చేస్తే ఆ విక్రేత సగటున 2.79 లక్షలు సంపాదిస్తాడు.
ఈ వీడియో చూసిన చాలా మంది ఉలిక్కిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోకు 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 27 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చిన్న వ్యాపారాలు గొప్ప భవిష్యత్తును నిర్మిస్తాయి``, ``అలాంటి వ్యాపారాలు మంచి లోకేషన్ మీద ఆధారపడి ఉంటాయి``, ``భారతీయ విద్యా వ్యవస్థకు ఇలాంటి వారు ప్రశ్నార్థకాలుగా మారతారు``, ``నేను కూడా చదువు మానేసేలా ఈ వీడియో ప్రోత్సహిస్తోంది``, ``దీని వెనుక చాలా కష్టం ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: 150 ఏళ్ల బతకాలనుకుంటున్న దంపతులు.. అందుకోసం వారు ఏమేం చేస్తున్నారో తెలిస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..