Share News

Viral Video: కలియుగ శ్రవణ కుమారుడు.. తల్లిదండ్రులను మోసుకెళ్తున్న కొడుకుపై విమర్శలు ఎందుకంటే..!

ABN , Publish Date - Jul 31 , 2024 | 06:21 PM

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టేనని భావించి వారిని కంటికి రెప్పలా చూసుకున్న పురాణ పురుషుడు శ్రవణ కుమారుడి కథ అందిరికీ తెలిసిందే. తల్లిదండ్రులను మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి ప్రాణాలు సైతం కోల్పోయిన శ్రవణ కుమారుడు చాలా మందికి ఆదర్శనీయుడు.

Viral Video: కలియుగ శ్రవణ కుమారుడు.. తల్లిదండ్రులను మోసుకెళ్తున్న కొడుకుపై విమర్శలు ఎందుకంటే..!
Shravan Kumar of Kalyug

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు (Parents) సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టేనని భావించి వారిని కంటికి రెప్పలా చూసుకున్న పురాణ పురుషుడు శ్రవణ కుమారుడి (Shravan Kumar) కథ అందిరికీ తెలిసిందే. తల్లిదండ్రులను మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి ప్రాణాలు సైతం కోల్పోయిన శ్రవణ కుమారుడు చాలా మందికి ఆదర్శనీయుడు. ఇప్పటికీ ఎవరైనా తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటే వారిని శ్రవణ కుమారుడితో పోల్చుతుంటారు. ప్రస్తుతం అలాంటి కలియుగ శ్రవణ కుమారుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అతడిపై విమర్శలు వస్తున్నాయి (Viral Video).


bhojpurireelz అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి తన వృద్ధ తల్లిదండ్రులను చెరో వైపు కూర్చోబెట్టుకుని శ్రవణ కుమారుడి తరహాలో కావడిపై మోస్తున్నాడు. అతడు హరిద్వార్ నుంచి రాజస్థాన్ వరకు వాళ్లను అలా తీసుకెళ్తున్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోపై విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియో చూస్తుంటే అతడు ఆ భారం మోయలేక చాలా బాధ పడుతున్నాడని, తల్లిదండ్రులు కూడా హాయిగా కూర్చోలేకపోతున్నారని తెలుస్తోంది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు కోటి మంది వీక్షించారు. 8 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఫాల్స్ పబ్లిసిటీ కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దు``, ``అతడు నిజానికి తన తల్లిదండ్రులను కష్టపెడుతున్నాడు``, ``ఆ వయసు వారిని ఇంట్లో ఉంచి సమయానికి ఆహారం అందిస్తే అదే పెద్ద పుణ్యం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదే.. బీచ్‌ సందర్శకులకు పరుగులు పెట్టించిన తూనీగలు!


Picture Puzzle: మీ ట్యాలెంట్‌కు టెస్ట్.. ఈ హైకింగ్ ఫొటోల్లోని 3 తేడాలను 15 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: బాయ్‌ఫ్రెండ్‌ కోసం వెరైటీ లంచ్ ప్యాక్.. అమ్మాయి పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

Viral News: పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు మహిళకు జైలు.. న్యూజిలాండ్ మహిళకు వింత అనుభవం!


Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!

Viral Video: వామ్మో.. ఇలా కూడా బస్సు నడుపుతారా? డ్రైవర్‌కు కండక్టర్ చేస్తున్న సహాయం చూస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2024 | 06:21 PM