WhatsApp: వాట్సప్‌లో ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చిక్కులు కొని తెచ్చుకున్నట్టే
ABN , Publish Date - Nov 07 , 2024 | 08:34 AM
వాట్సప్‌లో ఇన్‌స్టంట్ చాటింగ్, వీడియో కాలింగ్, ఫొటోలు, డాక్యుమెంట్ల షేరింగ్, వాయిస్ కాల్స్‌తో పాటు అనేక ఇతర సేవలు కూడా ఉన్నాయి. అయితే కంటెంట్ షేరింగ్ విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. అవగాహన లేకుండా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ని షేర్ చేస్తే చిక్కుల్లో పడడం ఖాయం.
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ గురించి ఈ రోజుల్లో తెలియనివారు పెద్దగా ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 400 కోట్ల మంది యూజర్లు ఉన్నారంటే ఈ యాప్ పాపులారిటీ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తగిన అప్‌డేట్‌లను అందిస్తుండడం, దీనికి పోటీ ఇచ్చే యాప్‌లు వచ్చినా పాపులారిటీ సాధించకలేకపోవడంతో వాట్సప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇన్‌స్టంట్ చాటింగ్, వీడియో కాలింగ్, ఫొటోలు, డాక్యుమెంట్ల షేరింగ్, వాయిస్ కాల్స్‌తో పాటు అనేక ఇతర సేవలను వాట్సప్ అందిస్తోంది. అయితే కంటెంట్ షేరింగ్ విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. అవగాహన లేకుండా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ని షేర్ చేస్తే చిక్కుల్లో పడడం ఖాయం.
కంటెంట్ షేర్ చేయడానికి అనువుగా ఉండే వాట్సప్‌ను కొందరు వ్యక్తులు సామాజిక అశాంతిని సృష్టించడానికి ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి వాట్సప్ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. నిర్దిష్ట ఫొటోలు, వీడియోలను నిషేదిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ నియమాలను ఉల్లంఘిస్తే యూజర్లు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిబంధనలు తెలుసుకోకుండా నిర్దేశిత ఫొటోలు లేదా వీడియోలను ప్రైవేట్ చాట్ లేదా గ్రూప్‌లో షేర్ చేస్తే ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతుంది. ఆ సందర్భంలో వాట్సప్ అకౌంట్‌ను శాశ్వతంగా బ్లాక్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వాట్సాప్‌లో షేర్ చేయకూడని కంటెంట్ ఇదే..
అడల్ట్ కంటెంట్ వద్దు..
వాట్సప్‌లో అడల్డ్ కంటెంట్‌ను షేర్ చేయకూడదు. నిషేధితమైన ఈ కంటెంట్‌ను షేర్ చేస్తే వాట్సప్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. సంబంధిత యూజర్ వాట్సప్ అకౌంట్‌ని నిలిపివేస్తారు. అదే పనిగా అడల్డ్ కంటెంట్ షేర్ చేస్తూ ఉంటే చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
దేశ వ్యతిరేక కంటెంట్‌ను దూరం దూరం..
దేశ వ్యతిరేక కంటెంట్‌ను వాట్సప్‌లో షేర్ చేయడానికి వీల్లేదు. ఫొటోలు లేదా వీడియోలను షేర్ చేయకూడదు. దేశంలో సామాజిక అశాంతిని రాజేసే కంటెంట్‌ను షేర్ చేస్తే వాట్సప్‌తో పాటు దేశ చట్టాలను కూడా అతిక్రమించినట్టు అవుతుంది. వాట్సప్ అకౌంట్‌ను నిలిపివేస్తారు. ఈ సందర్భంలో జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఏదైనా కంటెంట్ షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
చైల్డ్ పోర్నోగ్రఫీ జోలికి వెళ్లొద్దు...
వాట్సాప్‌లో పిల్లల అశ్లీలతకు సంబంధించిన ఏ కంటెంట్‌నూ షేర్ చేయకూడదు. ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేసేవారు చట్టపరమైన తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అవహేళనలు చేయవద్దు
వాట్సప్‌లో ఒకరిని అవహేళన చేస్తూ సరదాగా ఏదైనా కంటెంట్‌ను షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫోటో లేదా వీడియో రూపంలో ఎవరినైనా ఎగతాళి చేస్తే సదరు వ్యక్తి పరువు నష్టం దావా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఇవి కూడా చదవండి
ఓటమిపై స్పందించిన కమలా హారిస్.. ఆసక్తికర వ్యాఖ్యలు
గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్-ఎంఎస్ ధోనీ.. ఫొటోలు, వీడియోలు వైరల్
మీ భార్య డెలివరీకి ఇంటి దగ్గర ఉండాల్సి వస్తే.. గవాస్కర్‌కి ఆసీస్ మాజీ క్రికెటర్ కౌంటర్
విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయబోయిన వ్యక్తి.. ఆ తర్వాత జరిగిందిదే