Viral: కాలుష్యం తగ్గించడానికి ఏం చేయాలి? స్టూడెంట్ రాసిన ఆన్సర్ చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!
ABN , Publish Date - Apr 12 , 2024 | 03:43 PM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షల సీజన్ నడుస్తోంది. విద్యార్థులు ఎగ్జామ్ హాల్స్‌లో కుస్తీలు పడుతున్నారు. సంవత్సరం పాటు తాము నేర్చుకున్న జ్ఞానాన్ని పేపర్లపై పరుస్తున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు సరైన జవాబులు తెలియక తమకు తోచిన సమాధానాలు రాసేస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షల (Exams) సీజన్ నడుస్తోంది. విద్యార్థులు ఎగ్జామ్ హాల్స్‌లో కుస్తీలు పడుతున్నారు. సంవత్సరం పాటు తాము నేర్చుకున్న జ్ఞానాన్ని పేపర్లపై పరుస్తున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు సరైన జవాబులు తెలియక తమకు తోచిన సమాధానాలు రాసేస్తున్నారు. పేపర్లు దిద్దేటపుడు ఉపాధ్యాయులు వాటిని చూసి తలలు పట్టుకుంటున్నారు (Viral answer sheet). ఓ విద్యార్థి (Student) రాసిన జవాబు పత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral News).
``కాలుష్యాన్ని (Pollution) ఎలా నివారించవచ్చు?`` అనే ప్రశ్నకు విద్యార్థి రాసిన సమాధానం చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ``వాహనాల నుంచి వెలువడే పొగ, ఫ్యాక్టరీల నుంచి వెలువడే నీటిని తగ్గిస్తే కాలుష్యాన్ని తగ్గించవచ్చు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. దేవుడి ప్రమాణం చేస్తున్నాను. నేను నీ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నేను నిన్ను ఎప్పుడు కలుస్తానో చెబుతాను. మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే మీరు కాలుష్యం నుంచి రక్షణ పొందుతారు`` అంటూ ఆ విద్యార్థి ఏదేదో రాసేశాడు.
ఆ జవాబు చూసిన టీచర్‌కు బుర్ర తిరిగింది. దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ జవాబు చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఫ్యూచర్ ఐయేఎస్ ఆఫీసర్``, ``పాపం.. ఇంత కంటే ఏం రాయగలడు``, ``దీనికి అర్థం ఏంటో మరి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ కళ్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలోని ఆంగ్ల అక్షరాన్ని కనిపెట్టండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..