ఎండుటాకులపై ఎన్నెన్ని సిత్రాలో...
ABN , Publish Date - Dec 01 , 2024 | 10:54 AM
కాన్వాస్ మీద రంగురంగుల బొమ్మలు వేయడం అందరికీ తెలిసిన విద్య. అయితే ఇరాన్ చిత్రకారుడు ఒమిద్ అసదీ తన చిత్రకళకు భిన్నమైన కాన్వాస్‌ను ఎంచుకున్నాడు. చెట్ల నుంచి రాలిపడిన ఎండుటాకులపై... సూదులు, కట్టర్‌లే కుంచెలుగా చేసుకుని... అతడు అత్యంత ఓపికగా చెక్కే పత్ర శిల్పాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
కాన్వాస్ మీద రంగురంగుల బొమ్మలు వేయడం అందరికీ తెలిసిన విద్య. అయితే ఇరాన్ చిత్రకారుడు ఒమిద్ అసదీ తన చిత్రకళకు భిన్నమైన కాన్వాస్‌ను ఎంచుకున్నాడు. చెట్ల నుంచి రాలిపడిన ఎండుటాకులపై... సూదులు, కట్టర్‌లే కుంచెలుగా చేసుకుని... అతడు అత్యంత ఓపికగా చెక్కే పత్ర శిల్పాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అతి సూక్ష్మమైన వాటిని కూడా ఎండుటాకుపై ఏమాత్రం చెక్కుచెదరకుండా చెక్కడం అతడికి మాత్రమే తెలిసిన విద్య. చాలా దేశాల్లో అసదీ ఎగ్జిబిషన్లు సక్సెస్ అయ్యాయి.
సాధారణంగా చాలామంది చిత్రకారులు ఒక ఆబ్జెక్ట్‌ను మాత్రమే ఆకుపై చెక్కుతారు. కానీ ‘లీఫ్ ఆర్ట్’ను సాహిత్య సమ్మేళనంతో మరో మెట్టు ఎక్కించిన విభిన్న ‘చిత్ర’కారుడు అసదీ. ప్రస్తుతం మాంచెస్టర్‌లో తన కళకు మెరుగులు దిద్దుతూ... సరికొత్త ఆవిష్కరణలు, ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.