Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. భారీ అనకొండ ధాటికి కంచె ఎలా కూలిందో చూడండి.. వీడియో వైరల్!

ABN , Publish Date - Aug 13 , 2024 | 01:58 PM

పాము పేరు చెప్పగానే భయపడే వారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడతారు. అలాంటిది భారీ కొండచిలువను చూస్తే ఎలా ఉంటుంది. నేరుగా కాకుండా కొండచిలువ ఉన్న వీడియో చూసిన భయం వేస్తుంది.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. భారీ అనకొండ ధాటికి కంచె ఎలా కూలిందో చూడండి.. వీడియో వైరల్!
Python

పాము (Snake) పేరు చెప్పగానే భయపడే వారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడతారు. అలాంటిది భారీ కొండచిలువను (Python) చూస్తే ఎలా ఉంటుంది. నేరుగా కాకుండా కొండచిలువ ఉన్న వీడియో (Python Video) చూసిన భయం వేస్తుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలోని భారీ కొండచిలువను చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. @AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ భారీ కొండ చిలువ కంచెను కూలగొట్టి ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. అప్పటికే అది ఏదో జంతువును మింగేసినట్టు దాని ఉదర భాగం చాలా ఉబ్బెత్తుగా ఉంది. ఆహారం తిన్న వెంటనే కదలడానికి ఆ కొండచిలువ ఆపసోపాలు పడుతోంది. మెలికలు తిరిగిపోతోంది. అయితే గ్రామంలోకి ప్రవేశించిన ఆ కొండచిలువను పట్టుకోవడానికి గ్రామస్థులు ప్రయత్నించారు. దాని నోటిని తాడుతో కట్టేశారు. వారి నుంచి తప్పించుకున్న కొండ చిలువ ఓ కంచెను కూలగొట్టి ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 54 లక్షల మందికి పైగా వీక్షించారు. 16 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఈ కొండచిలువ మొత్తం గ్రామాన్ని మింగేసినట్టు ఉంది``, ``దాని నోటిని కట్టిన వ్యక్తి ఎవరో చాలా ధైర్యవంతుడు``, ``అది ఏదో పెద్ద జంతువునే మింగేసింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూాడా చదవండి..

Viral Video: దీన్ని పిచ్చి అంటారు భయ్యా.. లెహంగా ధరించి రైల్వే స్టేషన్‌లో డ్యాన్స్.. చివర్లో ఏం చేశాడో చూస్తే..


Viral Video: ప్రాణాల మీద ఆశ లేదా? కదులుతున్న లారీ వెనకాల స్కేటింగ్.. షాకింగ్ వీడియో వైరల్!


Picture Puzzle: ఈ పజిల్ సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు.. తేడాగా ఉన్న పులి మొహాన్ని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral: ``బై.. బై.. సర్``.. ఉద్యోగి పంపించిన రాజీనామా లెటర్ చూసి ఖంగుతున్న బాస్.. అసలు కథేంటంటే..!



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2024 | 01:58 PM