Viral Video: బ్రెజిల్‌లోనే ఇలాంటివి సాధ్యం.. నడిరోడ్డుపై భారీ కొండ చిలువ ఎలా వెళ్తోందో చూడండి..!
ABN , Publish Date - Jun 09 , 2024 | 09:57 AM
అడవులు కొట్టేయడం వన్య ప్రాణాలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. అడవుల మధ్య నుంచి రోడ్లు వేయడం భారీ ప్రమాదాలకు కారణమవుతోంది. తాజాగా బ్రెజిల్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. జాతీయ రహదారి పైకి అత్యంత భారీ కొండచిలువ వచ్చేసింది.
అడవులు కొట్టేయడం వన్య ప్రాణాలకు (Wild Animals) తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. అడవుల మధ్య నుంచి రోడ్లు వేయడం భారీ ప్రమాదాలకు కారణమవుతోంది. తాజాగా బ్రెజిల్ (Brazil)లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. జాతీయ రహదారి పైకి అత్యంత భారీ కొండచిలువ (Python) వచ్చేసింది. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).
ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ అనకొండ దాదాపు 25 అడుగుల పొడవు ఉంది. అంత భారీ అనకొండలు ఎక్కువగా బ్రెజిల్‌లోనే కనిపిస్తాయి. ఈ అనకొండ పొదల్లో నుంచి రోడ్డు మీదకు వచ్చి డివైడర్ దాటి అవతలి వైపునకు వెళ్లిపోయింది. ఆ భారీ అనకొండను చూసిన వాహనదారులు తమ వాహనాలను ఆపేశారు. ఆ అనకొండను చూసేందుకు ఆసక్తి చూపించారు. అయినా ఆ అనకొండ ఎవరికీ హాని చేసేందుకు ప్రయత్నించకుండా తిన్నగా రోడ్డు దాటి వెళ్లిపోయింది.
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోటి మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 59 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇలాంటి భారీ అనకొండలు బ్రెజిల్‌లోనే కనిపిస్తాయి``, ``అతిపెద్ద అందమైన పాము``, ``ఇది చాలా భయంకరంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ ఫొటోలో విభిన్నమైన జంట ఏదో కనిపెడితే మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అని నమ్మవచ్చు..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..