Share News

Viral Video: కిక్ ఎక్కాక.. కొండచిలువ అయినా డోంట్ కేర్.. మత్తులో ఉన్న వ్యక్తి పైకి ఎక్కిన కొండచిలువ ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Oct 16 , 2024 | 07:15 AM

మద్యం మత్తులో ఉన్న కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు. ఇంకొందరు అసలు ఏం జరుగుతుందో గుర్తించే స్పృహలో లేకుండా ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే మందు పవర్ ఏంటో అర్థమవుతుంది.

Viral Video: కిక్ ఎక్కాక.. కొండచిలువ అయినా డోంట్ కేర్.. మత్తులో ఉన్న వ్యక్తి పైకి ఎక్కిన కొండచిలువ ఏం చేసిందో చూడండి..
python On drunk man

ఎంత భయస్తుడైన వ్యక్తి అయినా మద్యం లోపలికి వెళ్లగానే సూపర్ మ్యాన్‌లా మారిపోతాడు. పెద్ద పెద్ద క్రూర మృగాలకు కూడా ఎదురు వెళ్లే ధైర్యం వచ్చేస్తుంది. కిక్‌లో (Drunken) ఉన్నప్పుడు అతడేం చేస్తున్నాడో అతడికే అర్థం కాదు. మద్యం మత్తులో ఉన్న కొందరు (Drunken Man) విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు. ఇంకొందరు అసలు ఏం జరుగుతుందో గుర్తించే స్పృహలో లేకుండా ఉంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే మందు పవర్ ఏంటో అర్థమవుతుంది (Viral Video).


ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. కర్నూలు జిల్లా అవుకు మండలం సింగనపల్లికి చెందిన లారీ డ్రైవర్ డ్యూటీ దిగి ఫుల్లుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఇంటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో గ్రామంలోని ఓ ఇంటి అరుగుపై కూర్చుండిపోయాడు. కొద్ది సేపటి తర్వాత సమీపంలోని పొదల్లోంచి ఓ కొండచిలువ (Python) బయటకు వచ్చింది. అరుగు మీద ఉన్న ఆ వ్యక్తి పైకి ఎక్కి కూర్చుంది. అయినా అతడికి ఏమీ తెలియలేదు. ఎలాంటి భయమూ లేకుండా హాయిగా కూర్చున్నాడు. అయితే అక్కడకు వచ్చిన స్థానికులు ఆ కొండచిలువను చూసి కేకలు వేశారు. అయినా మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి పట్టించుకోలేదు.


ఆ కొండచిలువను పట్టుకుని ఏదో మాట్లాడుతూ అక్కడే కూర్చున్నాడు. చివరకు స్థానికులు కర్రల సహాయంతో కొండచిలువను పక్కకు లాగేశారు. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 46 వేల మందికి పైగా వీక్షించారు. చాలా మంది ఈ వీడియోను లైక్ చేసి ఫన్నీ కామెంట్లు చచేశారు. ``మందు ఇచ్చే కిక్కు చావు భయం కంటే గొప్పగా ఉంటుంది``, ``అతడు మందు కిక్కులో ఉన్నాడని ఆ కొండచిలువ కూడా అతడిని ఏమీ చేయలేదు``, ``మత్తులో ఉన్న బాహుబలి`` అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..


Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న చిన్న తప్పును 5 సెకెన్లలో కనిపెట్టండి..

Viral Video: వావ్.. ఆ ఆంటీ తెలివితేటలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. గిన్నెలు తోమేందుకు సూపర్ టెక్నిక్..

Viral Video: ఇదెక్కడి చిత్రం.. రూ.90 వేలతో బైక్ కొన్నాడు.. రూ.60 వేలతో ఊరేగింపు చేశాడు..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 16 , 2024 | 07:15 AM