Share News

Viral Video: ఇలాంటి భర్త కోసం ఎన్ని పూజలైనా చేస్తాం.. భార్యతో కలిసి అతడు చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా!

ABN , Publish Date - Jul 21 , 2024 | 10:46 AM

పెళ్లిళ్లు, పార్టీల్లో కలిసి డ్యాన్స్‌లు చేసే జంటలను మీరు చూసే ఉంటారు. చాలా మంది దంపతులు ఆ డ్యాన్స్‌లను ముందుగానే ప్రాక్టీస్ చేస్తారు. అయినా పురుషులు డ్యాన్స్‌లు చేసేటపుడు బాగా సిగ్గుపడుతుంటారు. భార్యతో సమానంగా డ్యాన్స్ చేయలేరు.

Viral Video: ఇలాంటి భర్త కోసం ఎన్ని పూజలైనా చేస్తాం.. భార్యతో కలిసి అతడు చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా!
Husband and wife dance

పెళ్లిళ్లు, పార్టీల్లో కలిసి డ్యాన్స్‌లు చేసే జంటలను మీరు చూసే ఉంటారు. చాలా మంది దంపతులు (Couple) ఆ డ్యాన్స్‌లను ముందుగానే ప్రాక్టీస్ చేస్తారు. అయినా పురుషులు డ్యాన్స్‌లు చేసేటపుడు బాగా సిగ్గుపడుతుంటారు. భార్య (Wife)తో సమానంగా డ్యాన్స్ (Dance) చేయలేరు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన భార్య చేస్తున్న డ్యాన్స్‌ను అద్భుతంగా మ్యాచ్ చేశాడు. ఆమెను చూస్తూ చక్కటి స్టైల్‌తో రక్తి కట్టించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


gomtinayal అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పంచుకున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ జంట ``దిల్ తో పాగల్ హై`` సినిమాలోని ``కబ్ తక్ చుప్ బైతేంగే అబ్ తో కుచ్ హై బోల్నా`` పాటకు చిందులేస్తోంది. భార్య తన సహజ సిద్ధమైన స్టైల్‌తో చక్కగా డ్యాన్స్ చేస్తోంది. పక్కనే ఉన్న భర్త ఆమెను చూస్తూ ఆమె వేసే స్టెప్పులను యధాతథంగా కాపీ చేశాడు. వీరిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీని చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 57 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఇలాంటి భర్తలు ఎక్కడ దొరకుతారు``, ``ఇలాంటి భర్త కోసం ఎన్ని సోమవారాలైనా ఉపవాసం ఉంటా``, ``చాలా చక్కటి కెమిస్ట్రీ``, ``భార్యను బాగా ఫాలో అవుతున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: ఈ పిల్లులకు హెల్ప్ చేస్తారా? ఆ నీటిలో ఎలుక ఎక్కడుందో 10 సెకెన్లలో వెతికిపెట్టండి..!


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. మింగిన పామును బయటకు ఎలా వదులుతోందో చూడండి.. షాకవ్వాల్సిందే!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 21 , 2024 | 10:46 AM