Share News

Optical Illusion: మీవి హెచ్‌డీ కళ్లు అయితే.. ఈ ఫొటోలో ``Beading`` అనే పదాన్ని 10 సెకెన్లలో కనిపెట్టండి..!

ABN , Publish Date - Jul 30 , 2024 | 09:23 PM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Optical Illusion: మీవి హెచ్‌డీ కళ్లు అయితే.. ఈ ఫొటోలో ``Beading`` అనే పదాన్ని 10 సెకెన్లలో కనిపెట్టండి..!
Picture Puzzle

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో వరుసగా ఆంగ్ల పదాలు ఉన్నాయి. READING అనే పదం వివిధ వరుసల్లో ఉంది. అయితే వాటిల్లో ఒక్క పదం కాస్త భిన్నంగా ఉంది. ఒక్క చోట మాత్రం BEADING అని ఉంది. ఆ పదం ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 10 సెకెన్ల లోపు ఆ పదం ఎక్కడుందో కనిపెట్టాలి. అలా కనిపెడితే మీవి హెచ్‌డీ కళ్లు అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ పదం ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: బాయ్‌ఫ్రెండ్‌ కోసం వెరైటీ లంచ్ ప్యాక్.. అమ్మాయి పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

Viral News: పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు మహిళకు జైలు.. న్యూజిలాండ్ మహిళకు వింత అనుభవం!


Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!

Viral Video: వామ్మో.. ఇలా కూడా బస్సు నడుపుతారా? డ్రైవర్‌కు కండక్టర్ చేస్తున్న సహాయం చూస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Jul 30 , 2024 | 09:23 PM