Share News

Viral Video: బాయ్‌ఫ్రెండ్‌ కోసం వెరైటీ లంచ్ ప్యాక్.. అమ్మాయి పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

ABN , Publish Date - Jul 30 , 2024 | 09:02 PM

ప్రియమైన వారిని ఇంప్రెస్ చేసేందుకు కొద్ది మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. గాళ్‌ఫ్రెండ్స్ కోసం అబ్బాయిలు రకరకాల బహుమతులు ఇస్తే, అబ్బాయిల కోసం అమ్మాయిలు వెరైటీ వంటకాలు సిద్ధం చేస్తారు. తాజాగా ఓ అమ్మాయి చాలా వెరైటీగా తన బాయ్‌ఫ్రెండ్ కోసం లంచ్ ప్యాక్ చేసింది.

Viral Video: బాయ్‌ఫ్రెండ్‌ కోసం వెరైటీ లంచ్ ప్యాక్.. అమ్మాయి పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!
Lunch in Binder

ప్రియమైన వారిని ఇంప్రెస్ చేసేందుకు కొద్ది మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. గాళ్‌ఫ్రెండ్స్ (Girl Friend) కోసం అబ్బాయిలు రకరకాల బహుమతులు ఇస్తే, అబ్బాయిల కోసం అమ్మాయిలు వెరైటీ వంటకాలు సిద్ధం చేస్తారు. తాజాగా ఓ అమ్మాయి చాలా వెరైటీగా తన బాయ్‌ఫ్రెండ్ (Boyfriend) కోసం లంచ్ ప్యాక్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ప్యాకింగ్ (Lunch Pack) చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


pubity అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ కోసం బైండర్‌ (Binder)లో లంచ్ ప్యాక్ చేసింది. విద్యార్థులు తమ సర్టిఫికెట్లను పెట్టుకోవడానికి వాడే బైండర్‌లో ఆమె లంచ్ ప్యాక్ చేసింది. ఒక కవర్లో రెండు బ్రెడ్ ముక్కలు, మరో కవర్లో టమోటా పీస్‌లు, వేరే దానిలో పళ్ల ముక్కలు.. ఇలా రకరకాల ఫుడ్ వెరైటీలను ఆ బైండర్‌లోని కవర్లలో ఉంచింది. దానిని చూపిస్తూ ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. దాదాపు 60 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు 11 ఏళ్లు అనుకుంటా``, ``ఈ వీడియో చూశాక నా బ్రెయిన్ పాడైంది``, ``40 శాతం ఆహారం, 60 శాతం మైక్రో‌ప్లాస్టిక్స్``, ``మీ బాయ్‌ఫ్రెండ్ స్కూల్‌కు వెళ్తున్నాడా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral News: పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు మహిళకు జైలు.. న్యూజిలాండ్ మహిళకు వింత అనుభవం!


Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!

Viral Video: వామ్మో.. ఇలా కూడా బస్సు నడుపుతారా? డ్రైవర్‌కు కండక్టర్ చేస్తున్న సహాయం చూస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Jul 30 , 2024 | 09:02 PM