Share News

Viral Video: మీ కథ వినాలంటే రూ.1000, కథ చెబుతూ ఏడవాలనుకుంటే రూ.2,000.. ఓ ఆటోవాలా వింత బిజినెస్..

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:48 AM

సాధారణంగా లారీలు, ఆటోల మీద ఫన్నీ కొటేషన్స్, జాగ్రత్తలు రాసి ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ ఆటో వెనకాల ఏమి రాసి ఉందో చదవితే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఈ ఆటో డ్రైవర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఐడితో సహా ఆటో వెనుక భాగంలో ఓ యాడ్‌ను ముద్రించాడు.

Viral Video: మీ కథ వినాలంటే రూ.1000, కథ చెబుతూ ఏడవాలనుకుంటే రూ.2,000.. ఓ ఆటోవాలా వింత బిజినెస్..
funny quotations on auto

ఆటోలు, లారీల వెనుక రాసి ఉండే కొన్ని ఫన్నీ కొటేషన్లు భలే నవ్వు తెప్పిస్తుంటాయి. రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు, ట్రాఫిక్ జామ్‌ల్లో ఇరుక్కుపోయినప్పుడు వాటిని చదివితే చాలు.. చిరాకు అంతా మటుమాయం అవుతుంది. సాధారణంగా వాటి మీద ఫన్నీ కొటేషన్స్, జాగ్రత్తలు రాసి ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ ఆటో (Auto) వెనకాల ఏమి రాసి ఉందో చదవితే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఈ ఆటో డ్రైవర్ (Auto Driver) తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీతో సహా ఆటో వెనుక భాగంలో ముద్రించి తన ఆలోచనను చాలా ఫన్నీగా ప్రచారం చేశాడు (Viral Video).


swathi_siara అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఆటో రోడ్డుపై ప్రయాణిస్తోంది. ఆ ఆటో వెనకాల ఏదో రాసి ఉంది. ఆటో వెనుక ఓ యాడ్ ఉంది. ఆ యాడ్‌లో.. ``మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటున్నారా? నేను ఉన్నాను. సాధారణ సమస్య-రూ.500, విషాద కథ- రూ.1000, కథ చెప్పడంతో పాటు ఏడవాలనుకుంటే- రూ.2000`` అంటూ రాసింది. దాంతో పాటు ఆ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా అక్కడ రాసి ఉంది. ఆ ఆటో వెనుక కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. 54.5 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నేను నిన్ను చెంపదెబ్బ కొట్టాలనుకుంటే?.. ఎంత తీసుకుంటారు``, ``నాతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంత తీసుకుంటారు``, ``ఇదెక్కడి బిజినెస్ ఐడియా``, ``మంచి వ్యాపారం``, ``ఆటో నడుపుతూనే సమస్యలు వింటాడేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 21 , 2024 | 12:04 PM