PIN Number: మీ పిన్ నెంబర్ ఇందులో ఉందేమో చూసుకోండి.. వెంటనే మార్చుకోకపోతే ప్రమాదం తప్పదు!
ABN , Publish Date - May 17 , 2024 | 12:40 PM
ప్రస్తుత డిజిటల్ యుగంలో పిన్ నెంబర్ అనేది కీలకంగా మారిపోయింది. చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు, ఏటీఎమ్‌లకు పిన్ నెంబర్ అనేది రక్షణ కవచం లాంటిది. ఇతరులు మన వస్తువులను ఉపయోగించకుండా మన పిన్ కాపాడుతుంటుంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో పిన్ నెంబర్ అనేది కీలకంగా మారిపోయింది. చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు, ఏటీఎమ్‌లకు పిన్ నెంబర్ (PIN Number) అనేది రక్షణ కవచం లాంటిది. ఇతరులు మన వస్తువులను ఉపయోగించకుండా మన పిన్ కాపాడుతుంటుంది. అలాంటి పిన్ విషయంలో కొందరు అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. చాలా సులభమైన పిన్ నెంబర్ పెట్టుకుంటారు. "1234" లేదా "0000" వంటి బలహీనమైన పిన్ నెంబర్‌లను, పుట్టినరోజు లేదా ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారం ఆధారంగా పిన్ సెట్ చేసుకుంటారు (Technology News).
అలాంటి పిన్ నెంబర్ల కారణంగానే సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హ్యాకర్లు చాలా సులభంగా వాటిని తెరవగలుగుతారు. ఓ నివేదిక ప్రకారం మన దేశంలో సైబర్ మోసాల సంఖ్య ప్రతి ఏడాది 33 శాతం పెరుగుతూ వస్తోందట. వీటిల్లో చాలా కేసుల్లో బలహీనమైన పిన్ కారణం అని తేలింది. ఇటీవల ఓ సైబర్‌సెక్యూరిటీ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం చాలా మంది వ్యక్తులు తమ పిన్ నెంబర్ల కోసం సాధారణ నమూనాలను ఉపయోగిస్తున్నారని తేలంది. వాళ్లు పరీక్షించిన 34 లక్షల పిన్ నెంబర్లలో అత్యంత సాధారణమైనవేంటో ఒకసారి చూద్దాం.. మీ పిన్ కూడా ఈ కింది జాబితాలో ఉంటే వెంటనే మార్చుకోండి.
1) 1234
2) 1111
3) 0000
4) 1212
5) 7777
6) 1004
7) 2000
8) 4444
9) 2222
10) 6969
ఇవి కూడా చదవండి..
WhatsApp: నంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సప్ మెసేజ్‌లు పంపడం ఎలాగో తెలుసా?
Spam Calls: త్వరలోనే స్పామ్ కాల్స్ బంద్.. ఆదేశాలు జారీ చేసిన ట్రాయ్
మరిన్ని టెక్నాలజీ వార్తలు కోసం క్లిక్ చేయండి..