Share News

Viral: 35 వేల పుస్తకాలు చదివిన ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే..!

ABN , Publish Date - Jun 25 , 2024 | 09:44 PM

బీహార్‌కు చెందిన ఓ వ్యక్తికి పుస్తకపఠనం ఓ వ్యసనంగా మారింది. ఎంతలా అంటే అతడు 35 ఏళ్లకే 35 వేల పైచిలుకు పుస్తకాలు చదివాడు. ఇలా పుస్తకాల పురుగులా మారి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ వ్యక్తి పేరు అమల్ కుమార్ ఝా.

Viral: 35 వేల పుస్తకాలు చదివిన ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే..!

ఇంటర్నెట్ డెస్క్: పుస్తకపఠనాన్ని అలవాటుగా మార్చుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. మొదటి పేజీ చదవగానే ఆవలింతలొచ్చి నిద్రలోకి జారుకునే జనాలు కోకొల్లలు. కానీ, బీహార్‌కు చెందిన ఓ వ్యక్తికి పుస్తకపఠనం ఓ వ్యసనంగా మారింది. ఎంతలా అంటే అతడు 35 ఏళ్లకే 35 వేల పైచిలుకు పుస్తకాలు చదివాడు. ఇలా పుస్తకాల పురుగులా మారి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ వ్యక్తి పేరు అమల్ కుమార్ ఝా. ప్రస్తుతం అమల్ కుమార్ ఝా ఉదంతం నెట్టింట ట్రెండింగ్‌లో (Viral) కొనసాగుతోంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, మధుబని జిల్లాకు చెందిన అమల్ కుమార్ తరచూ స్థానిక లైబ్రెరీకి వెళ్లి పుస్తకాలు తెచ్చుకుంటాడు. స్థానికంగా జరిగే పుస్తక పఠన పోటీల్లో ఆయన గత నాలుగేళ్లుగా నెం. 1 స్థానంలో నిలుస్తున్నారు. సాహిత్యం, చట్టం తదితర అంశాలను చెందిన వివిధ భాషల పుస్తకాలు చదవడం అతనికి ఇష్టం (In Bihars Amal kumar Jha Has Read 35000 Books).

Viral: కిలాడీ జంట! చచ్చిన ఈగలతో వీళ్లేం చేస్తారో తెలిస్తే..


పుస్తకపఠనం అలవాటు కారణంగా అమల్ కుమార్ ఝా స్థానికంగా గొప్ప పాప్యులారిటీ సంపాదించాడు. అక్కడ నిర్వహించే పోటీల ప్రకారం, లైబ్రరీలో పస్తుకాలు చదివేవాళ్లు ఏటా ఓ పోటీలో పాల్గొంటారు. తాము చదివిన పుస్తకాలకు సంబంధించి ఆ పోటీల్లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. ఈ పోటీల్లో అమల్ కుమార్ వరుసగా నాలుగో సారి టాప్ లో నిలిచాడు.

చిన్నతనం నుంచి తనకు పుస్తకాలంటే పిచ్చి అని అమల్ కుమార్ ఝా చెప్పుకొచ్చాడు. తన ఇంట్లో కూడా ఓ చిన్నా పాటి లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నాడు. తనకు పుస్తకాలు కొనుక్కోవడం కంటే లైబ్రెరీలో చదవటమే ఇష్టమని అతడు చెప్పాడు.

Read Viral and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 09:50 PM