Share News

Independence Day: భారతదేశం మాత్రమే కాదు.. ఈ దేశాలు కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాయి..!

ABN , Publish Date - Aug 14 , 2024 | 01:12 PM

దేశం యావత్తు ఆగస్టు 15న దేశభక్తితో పులకరిస్తుంది. అయితే భారతదేశం మాత్రమే కాదు.. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం పొందిన ఇతర దేశాలు కూడా ఉన్నాయి.

Independence Day:  భారతదేశం మాత్రమే కాదు.. ఈ దేశాలు కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాయి..!
Independence Day

భారతదేశం తెల్లదొరల పాలన నుండి విముక్తి పొందిన రోజు.. బానిసత్వం నుండి స్వేచ్ఛను సంపాదించుకున్న రోజూ ఆగస్టు 15. దేశం యావత్తు ఆగస్టు 15న దేశభక్తితో పులకరిస్తుంది. అయితే భారతదేశం మాత్రమే కాదు.. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం పొందిన ఇతర దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలలో ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు జరుగుతాయి. ఆ దేశాలు ఏంటో ఓ లుక్కేస్తే..

ఆయుర్వేదం చెప్పిన రహస్యాలు.. వర్షాకాలంలో ఈ ఆహారాలు తింటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు..!



దక్షిణ కొరియా..

sk.jpg

దక్షిణ కొరియా 1945, ఆగస్టు 15న జపనీస్ పాలన నుండి విముక్తి పొందింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను అక్కడ గ్వాంగ్‌బోక్‌జియోల్‌ అని అంటారు. అంటే కొత్త వెలుగు పునరిద్దరణ పొందిన రోజు అని అర్థమట. ఈ రోజున దక్షిణ కొరియాలో కూడా వేడుకలు, కవాతులు , సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!


ఉత్తర కొరియా..

nk.jpg

ఉత్తర కొరియా కూడా జపాన్ ఆక్రమణ నుండి స్వతంత్య్రాన్ని ఆగస్టు 15నే పొందింది. అక్కడ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను చోగుఖేబాంగ్'యిల్ అని పిలుస్తారు. ఇక్కడ వేడుకలు రాష్ట్రవ్యవస్థీకృతమైనవి. బహిరంగంగానే ఈవెంట్లు జరుగుతాయి. సైనిక కవాతులు, ప్రసంగాలు, దేశభక్తి కార్యక్రమాలు జరుగుతాయి.

ఆడవారిలో ఈ 8 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!


కాంగో..

kango.jpg

రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆగస్టు 15, 1960 న ఫ్రాన్స్ న సంపూర్ణ స్వాతంత్య్రం పొందింది. ఇది ఫ్రెంచ్ పాలనలో పడిపోయి సరిగ్గా 80 సంవత్సరాలు. 1969 నుండి 1992 వరకు దేశం మార్కిస్ట్ లెనినిస్ట్ రాజ్యంగా ఉంది. ఆ తరువాత బహుళ పార్టీ ఎన్నగల నిర్వహణకు మారింది. కవాతులు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలతో వేడుకలు జరుగుతాయి.

టీతో రస్క్ తినే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలిస్తే..!


లిచెన్ స్టెయిన్..

lst.jpg

ఆగస్టు 15 లిచెన్ స్టెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం కాదు. కానీ ఆ దేశపు జాతీయ దినాన్న ఆగస్టు 15న జరుపుకుంటారు. చాలా దేశాలలో జరుపుకునే అజంప్షన్ అనే మతపరమైన పండుగ సందర్బంగా ఆగస్టు 15ను సెలవు దినంగా జరుపుకుంటారు. దేశ సార్వభౌమాధికారం, గుర్తింపు కోసం అక్కడి యువరాజు ఉత్సవాల రూపంలో ఆగస్టు 15ను వేడుకగా నిర్వహిస్తారు.

ప్రతిరోజూ సూర్య నమస్కారాలు వేస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?


బహ్రెయిన్..

bah.jpg

ఆగస్టు 15, 1971 న యునైటెడ్ కింగ్డమ్ నుండి బహ్రెయిన్ స్వాతంత్య్రాన్ని పొందింది. 1931లో చమురును కనుగొని చమురు శుద్ది కర్మాగారాన్ని స్థాపించిన మొదటి గల్ఫ్ దేశాలలో ఇది ఒకటి. అదే సంవత్సరం బ్రిటన్, ఒట్టోమన్ ప్రభుత్వాలు బహ్రెయిన్ స్వాతంత్య్రాన్ని గుర్తిస్తూ సంతకాలు చేసినా 1971 వరకు బ్రిటన్ పాలనలో కొనసాగింది. ఆ తరువాత బ్రిటన్ తో స్నేహ ఒప్పందం చేసుకుంది. బహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 14 న పేర్కొన్నా అధికారికంగా ఆగస్టు 15 న నిర్వహిస్తారు.

అరచేతులను రుద్దితే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా..?


జపాన్..

japan.jpg

జపాన్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోదు.. కానీ జపాన్ చరిత్రలో ఆగస్టు 15కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆగస్టు 15, 1945లో జపాన్ చక్రవర్తి హిరోహిటో రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్ లొంగిపోతున్నట్టు ప్రకటించారు. దీన్ని రెండవ ప్రపంచ యుద్ద ముగింపు దినంగా పరిగణిస్తారు.దీన్ని ఎండ్ ఆఫ్ వార్ మెమోరియల్ డే అని పిలుస్తారు.

యవ్వనంగా ఉండటానికి ఆయుర్వేదం చెప్పిన రహస్య చిట్కాలు..!

రోజూ ఒక లవంగాన్ని నమిలి తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 14 , 2024 | 01:12 PM