Home » August 15
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలిస్తుంటే.. హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (Hyderabad Metropolitan Development Corporation)లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెల గడిచి 15 రోజులైనా వేతనాలు అందలేదు.
కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గురువారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వేదికపై తన కూతురు ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు.
స్వాతంత్య్ర సమరయోధులు కలలు కన్న వికసిత్ భారత్ నిర్మాణంలో యువతరం భాగస్వామి కావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
‘ప్రజలే దేవుళ్లన్న ఎన్టీ రామారావు, జనతా జనార్దన్ అన్న నరేంద్ర మోదీ.. వ్యాఖ్యల స్ఫూర్తితో ప్రజలకు సేవకులమై వారి కన్నీరు తుడుస్తాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
రాష్ట్రంలో ఐదేళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని, విధ్వంసక పాలన నుంచి విముక్తి కలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
విశాఖకు చెందిన ‘లైవ్ ఇన్ అడ్వంచర్స్’ సభ్యులు గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సముద్రంలో 78 అడుగుల లోతులో జాతీయ జెండాను ఎగురవేసి ఔరా అనిపించారు.
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటికి వెళ్లే రోడ్ మొదట్లో గతంలో తొలగించిన చోటే భరతమాత విగ్రహాన్ని గురువారం మళ్లీ పునఃపత్రిష్ఠ చేసి ఆవిష్కరించారు.
సీఎం చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలకు ఎలాంటి కండీషన్లు ఉండవని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అనవరమైన నిబంధనలతో సంక్షేమ కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లో కోత పెట్టబోమన్నారు.
రాష్ట్ర హైకోర్టులో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు.
నాటి సమర యోధుల ప్రాణ త్యాగాల ఫలితంగానే నేడు భారతీయులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవించగలుగుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ అన్నారు.