Viral Video: వీడియో: చీరలో విద్యార్థిని సూపర్ డ్యాన్స్.. ఈ పెర్ఫార్మెన్స్ చూడాల్సిందే
ABN , Publish Date - Nov 05 , 2024 | 07:24 PM
Viral Video: చీరలో డ్యాన్స్ చేయలాంటే చాలా మంది ఇబ్బంది పడతారు. కానీ ఓ అమ్మాయి మాత్రం శారీలో అద్భుతమైన స్టెప్స్ వేస్తూ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ చూసితీరాల్సిందే.
చీరలో డ్యాన్స్ చేయడం అంత ఈజీ కాదు. సంప్రదాయ నృత్యాలు చేయడం సులువే. కానీ అలాంటి కాస్ట్యూమ్‌లో ఇతర తరహా డ్యాన్సులు చేయడం మాత్రం చాలా కష్టం. కానీ ఓ అమ్మాయి చీర కట్టుకొని అలవోకగా వెస్ట్రర్న్ డ్యాన్స్ చేసేసింది. శారీలో బుట్టబొమ్మలా మెరిసిపోయిన ఆ అమ్మాయి.. ఓ బాలీవుడ్ హిట్ సాంగ్‌కు నెమలిలా అద్భుతంగా నాట్యం చేసింది. ఇది జరిగింది మన దగ్గర కాదు.. ఆస్ట్రేలియాలో కావడం గమనార్హం.
మాస్ స్టెప్స్
ఆస్ట్రేలియాలోని ఓ యూనివర్సిటీలో నిర్వహించిన ఈవెంట్లో ఒక భారత సంతతి అమ్మాయి అదరగొట్టింది. సూపర్బ్ డ్యాన్స్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చీర కట్టుకొని స్టేజ్ మీదకు వచ్చిన ఆ అమ్మాయి భరతనాట్యం, కూచిపూడి లాంటి క్లాసికల్ డ్యాన్స్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ హిందీ పాట ‘ఫెవికాల్ సే’కు అదిరిపోయే మాస్ స్టెప్స్ వేసిందామె. స్టైలిష్ డ్యాన్స్‌తో ఆడిటోరియంలోని అందర్నీ మెస్మరైజ్ చేసింది.
డ్యాన్స్ కంటే అదే హైలైట్
అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నంత సేపు ఆడియెన్స్ విజిల్స్, చప్పట్లతో ఆమెను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఈ పెర్ఫార్మెన్స్కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. అమ్మాయి భలేగా డ్యాన్స్ చేసిందని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా హుక్ స్టెప్స్ బాగా వేసిందని ప్రశంసిస్తున్నారు. ఆమె డ్యాన్స్‌లో ఉన్న ఈజ్, తన మీద తనకు ఉన్న నమ్మకం, నవ్వు చెరగకుండా చూసుకోవడం ఈ పెర్ఫార్మెన్స్ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఒక్క పెర్ఫార్మెన్స్తోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిందామె.
Also Read:
తీర్థం అనుకుని.. ఆలయంలో ఈ భక్తులు చేసిన పని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..
అందుకే దీన్ని టైగర్ అనేది.. కాలువపై అది చేసిన విన్యాసం చూస్తే.. నోరెళ్లబెడతారు..
ఈ గుర్రమేంటీ ఇలా చేసిందీ.. స్కూటీపై వెళ్తున్న యువతులకు ఎలాంటి షాక్ ఇచ్చిందో చూడండి..
For More Viral And Telugu News