Indigo Flight: విమానంలో విచిత్రం.. సీటు లేకపోవడంతో ఏం జరిగిందంటే?
ABN , Publish Date - May 23 , 2024 | 10:50 AM
బస్సులు, రైళ్లలో ప్రయాణికులు నిండుగా ఉన్నప్పుడు.. కూర్చోవడానికి సీటు లేక నిల్చొనే వెళ్తుంటారు. ఇది సర్వసాధారణం. కానీ.. విమానంలో ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా?
బస్సులు, రైళ్లలో ప్రయాణికులు నిండుగా ఉన్నప్పుడు.. కూర్చోవడానికి సీటు లేక నిల్చొనే వెళ్తుంటారు. ఇది సర్వసాధారణం. కానీ.. విమానంలో ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా? తనకు కూర్చోవడానికి సీటు లేకపోవడంతో.. ఓ పాసింజర్ నిల్చొనే ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. తీరా సిబ్బంది గుర్తించి, జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకుంది. ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే విమానంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Read Also: వామ్మో..! గుడ్లగూబ ఇలాంటి పనులు చేస్తాయా..
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు (IndiGo Airlines) చెందిన 6E 6543 విమానం మంగళవారం ఉదయం 7:50 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్ (Chhatrapati Shivaji Airport) నుంచి వారణాసికి బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఇక టేకాఫ్ అవ్వడమే ఆలస్యమని అనుకున్న తరుణంలో.. విమానం వెనుక భాగంలో ఓ ప్రయాణికుడు నిలబడి ఉండటాన్ని సిబ్బంది గమనించింది. దీంతో.. అతడిని విమానం నుంచి కిందకు దించేశారు. ఈ కారణంగా.. టేకాఫ్ కొంత ఆలస్యం అయ్యింది. ఇంతకీ ఆ ప్రయాణికుడు మరెవ్వరో కాదు.. ఇండిగో ఉద్యోగి. అతడు స్టాఫ్ లీజర్ ట్రావెల్‌లో భాగంగా ప్రయాణం చేసేందుకు విమానం ఎక్కాడు. ఓ ప్రయాణికుడు రాలేదనే సమాచారం అందడంతో.. ఆ సీటుని ఇండిగో ఉద్యోగికి స్టాండ్‌బైగా ఇచ్చారు.
తీరా ఫ్లైట్ ఎక్కిన తర్వాత చూస్తే.. ఆ సీటుని బుక్ చేసుకున్న ప్రయాణికుడు ఆల్రెడీ విమానంలోనే ఉన్నాడు. దీంతో మరో దారి లేక.. నిలబడే ప్రయాణం చేయాలని ఇండిగో ఉద్యోగి నిర్ణయించుకున్నాడు. ఇది గమనించిన విమాన సిబ్బంది.. విమానం నిలిపివేసి, అతడిని కిందకు దించేశారు. ఈ వ్యవహారాన్ని బోర్డింగ్ ప్రాసెస్ తప్పిందగా గుర్తించారు. దీనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. టేకాఫ్‌కి ముందు ఓ లోపం గుర్తించబడిందని, స్టాండ్‌బై పాసింజర్‌ను కిందకు దించేశామని, దీంతో టేకాఫ్‌కు ఆలస్యమైందని పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తన ప్రకటనలో తెలిపింది.
Read Latest Viral News and Telugu News