Share News

Viral: ఈ పోస్టును మీ నాన్న చూస్తే గుండెలు బాదుకుంటాడు.. యువతిపై నెటిజన్ల ఫైర్

ABN , Publish Date - May 30 , 2024 | 05:59 PM

అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటానంటూ ఓ యువతి పెట్టిన పోస్టు నెట్టింట పెద్ద దుమారం రేపుతోంది. భారతీయ యువతలో పెడ ధోరణలు కనిపిస్తున్నాయంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

Viral: ఈ పోస్టును మీ నాన్న చూస్తే గుండెలు బాదుకుంటాడు.. యువతిపై నెటిజన్ల ఫైర్

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక సమాజంలో డేటింగ్ సంస్కృతి వింత మార్పులకు లోనవుతోంది. బ్రేకప్‌లు, డైవర్స్‌లు సాధారణ అంశంగా మారిపోయాయి. మనసుకు ఆహ్లాదం కలిగించాల్సిన ప్రేమ కూడా రకరకాల ఒత్తిడులకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఓ యువతి పెట్టిన పోస్టు పెద్ద చర్చనీయాంశంగా (Viral) మారింది. అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటానంటూ ఆమె ఇచ్చిన ఆఫర్ చూసి జనాలు తిట్టిపోస్తున్నారు.

ఒంటరితనం అధికంగా ఉన్న జపాన్‌లో అద్దె గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్‌లు ఉంటారు. ఒంటరితనంతో ఇబ్బంది పడేవాళ్లు వీళ్ల సేవలు పొందొచ్చు. కబుర్లు చెప్పడం, టూర్లకు వెంట రావడం వంటివి మాత్రమే చేస్తారు. సరిగ్గా ఇదే ఆఫర్‌తో ఆ యువతి పోస్టు పెట్టింది. తాను ఓ రోజుకు అద్దె గర్ల్ ఫ్రెండ్ లా ఉండేందుకు ఎంత చార్జి చేసేది ఆమె సవివరంగా చెప్పుకొచ్చింది.

Viral: ఈ వైరస్ ఎయిర్ పోర్టులోనూ కాలుపెట్టింది.. ప్రధాని కల్పించుకోకతప్పదు.. వైరల్ వీడియో


కలిసి కాఫీ తాగేందుకు రూ.1500, డిన్నర్ మూవీకి వెళ్లేందుకు రూ.2000, కుటుంబసభ్యులను పలకరించేందుకు రూ.3 వేలు, ఏదైనా కార్యక్రమానికి తోడుగా వచ్చేందుకు రూ.3 వేలు, బైక్‌పై షికారుకు వచ్చేందుకు రూ.4 వేలు, తమ డేట్ గురించి పబ్లిక్ గా చెప్పేందుకు రూ.6 వేలు.. ఇలా రకరకాల చార్జీలను ఆమె పోస్టు చేసింది (Instagram influencer wants to become rental girlfriend shares her price chart).

ఇది చూసిన జనాలు ఆమెను తిట్టిపోశారు. ఈ పోస్టు నీ తండ్రి చూస్తే గుండెలు బాదుకుంటాడంటూ ఓ వ్యక్తి మండిపడ్డాడు. స్కూల్ అసైన్మెంట్లు రాసేందుకు ఎంత తీసుకుంటారంటూ మరో వ్యక్తి తుంటరి ప్రశ్న వేశాడు. కొందరు మాత్రం యువతిని తీవ్రంగా విమర్శించారు. యువత పెడదోవ పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డేటింగ్ సంస్కృతి భారతీయ మూలాలను దెబ్బతీస్తోందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ పోస్టు చర్చనీయాంశమవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - May 30 , 2024 | 06:06 PM