ViralVideo: ఎవరు బ్రో నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు.. నెటిజన్లను షేక్ చేస్తున్న వీడియో ఇది!
ABN , Publish Date - Feb 15 , 2024 | 09:37 PM
యువకుడు ఒక్క వేటుతో కొబ్బరి చెట్టును నరికేసిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కొబ్బరి, తాటి చెట్లను కొట్టేయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. జనావాసాలకు దూరంగా ఉన్నవాటిని కొట్టేసేందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటిది.. రహదారి పక్కనే ఉన్న ఇంట్లోలోని కొబ్బరి చెట్టును ఓ కుర్రాడు అతి సునాయసంగా కొట్టేసిన తీరు జనాలను షేక్ చేస్తోంది. ఏ చిన్న పొరపాటు జరిగినా వచ్చి పడే ప్రమాదాన్ని ఊహించుకుని జనాలు షాకైపోతున్నారు. అనుభవం అంటే ఇదే..దీని ముందు ఎంత పెద్ద చదువులైనా దిగదుడుపే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా (ViralVideo) మారింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి పెద్ద కొబ్బరి చెట్టు ఎక్కాడు. అతడి చేతులో ఓ మెకానికల్ రంపం ఉంది. అతడికి ఎదురుగా రద్దీ రోడ్డు ఒకటి ఉంది. రోడ్డుకు పక్కగా కరెంటు స్తంభాలు వైర్లు కూడా ఉన్నాయి. అంటే, ఏ చిన్న పొరపాటు జరిగినా చెట్టు కూలి కరెంటు తీగలను తగులూ రోడ్డుపై పడుతుంది. టైం బాలేకపోతే వాహనదారులపై పడి వాళ్ల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. చెట్టును కొట్టేందుకు సిద్ధమైన వ్యక్తికి ఇవన్నీ తెలిసి తన టెక్నిక్‌తో ఎటువంటి అపాయం జరక్కుండా పని పూర్తి చేశాడు (Internet Lauds Man Who Chopped Tree In One Go).
మొదట అతడు చెట్టులో 60 శాతం వరకూ కొత పెట్టాడు. ఆ తరువాత దాని కిందనే కాస్తంత ఒంకరగా అంతేలోతుకు మరో కోత పెట్టి చెట్టు నుంచి ఓ ముక్కను బయటకు లాగేశాడు. దీంతో, ఏర్పడిన ఖాళీవైపు.. అంటే ఆ ఇంటి లోపలివైపుకే చెట్టు ఒరిగి కూలిపోయింది. పక్కింట్లోని వ్యక్తి ఇదంతా రికార్డు చేసి నెట్టింట పెట్డడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. చెట్టును ఒడుపుగా నరికిన యువకుడి టాలెంట్‌కు జనాలు ఫిదా అయిపోతున్నారు. అనుభవానికి పీహెచ్‌డీ కూడా సాటి రాదంటూ కామెంట్ చేస్తున్నారు. భారత్‌లో బతకాలంటే ఈ మాత్రం టాలెంట్ ఉండాలని కొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ వీడియో వైరల్‌గా మారింది.