సముద్ర గర్భంలోకి...
ABN , Publish Date - Nov 03 , 2024 | 10:32 AM
భూగోళం మూడొంతులు నీళ్లతో నిండి ఉంది. ఈ సముద్రాల్లో ఉన్న జీవరాశుల్ని లెక్కించడం తలకు మించిన భారమే. ఇప్పటిదాకా రెండున్నర లక్షల జాతుల జీవుల్ని గుర్తించారు. మనకు తెలియని ఈ ప్రపంచాన్ని దగ్గర నుంచి చూసే అవకాశాన్ని కలిగిస్తోంది ‘ఓషన్ ఒడిస్సీ’.
భూగోళం మూడొంతులు నీళ్లతో నిండి ఉంది. ఈ సముద్రాల్లో ఉన్న జీవరాశుల్ని లెక్కించడం తలకు మించిన భారమే. ఇప్పటిదాకా రెండున్నర లక్షల జాతుల జీవుల్ని గుర్తించారు. మనకు తెలియని ఈ ప్రపంచాన్ని దగ్గర నుంచి చూసే అవకాశాన్ని కలిగిస్తోంది ‘ఓషన్ ఒడిస్సీ’. అందరూ పూర్తిగా లీనమయ్యే ఎగ్జిబిషన్ ఇది. సముద్రాల్లో జీవరాశుల జీవన వీడియోలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
వీటిని క్యాప్చర్ చేసింది ప్రసిద్ధ ‘నేషనల్ జియోగ్రాఫిక్’ ఫొటోగ్రాఫర్ బ్రియన్ స్కెర్రీ. పది వేలకు పైగా గంటలను వివిధ సముద్రాల్లో గడిపి ఎన్నో అరుదైన దృశ్యాలను ఆయన చిత్రీకరించారు. ఆ వీడియోలను వివిధ నగరాలలో ‘ఓషన్ ఒడిస్సీ’ పేరుతో ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం జర్మనీలోని డార్ట్‌మండ్ నగరంలో ఈ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఆడియో వీడియో ప్రెజెంటేషన్ చూసి సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు.