Share News

పాస్‌వర్డ్‌ భద్రమేనా...

ABN , Publish Date - Dec 15 , 2024 | 07:47 AM

డిజిటల్‌ యుగంలో సెక్యూరిటీ అనేది పేద్ద తలనొప్పిగా మారింది. బ్యాంకింగ్‌, ఫేస్‌బుక్‌, ఈ మెయిల్‌... ఇతరత్రా ఖాతాలకు ‘పాస్‌వర్డ్‌’ ముఖ్యం. అది ఒక తాళం లాంటిది. అయితే ఈ తాళం భద్రమేనా? సైబర్‌ దొంగతనాలు విరివిగా జరుగుతున్న ఈ కాలంలో బలహీనమైన ‘పాస్‌వర్డ్‌’ అంటే... దొంగచేతికి తాళాలిచ్చినట్టే.

పాస్‌వర్డ్‌ భద్రమేనా...

డిజిటల్‌ యుగంలో సెక్యూరిటీ అనేది పేద్ద తలనొప్పిగా మారింది. బ్యాంకింగ్‌, ఫేస్‌బుక్‌, ఈ మెయిల్‌... ఇతరత్రా ఖాతాలకు ‘పాస్‌వర్డ్‌’ ముఖ్యం. అది ఒక తాళం లాంటిది. అయితే ఈ తాళం భద్రమేనా? సైబర్‌ దొంగతనాలు విరివిగా జరుగుతున్న ఈ కాలంలో బలహీనమైన ‘పాస్‌వర్డ్‌’ అంటే... దొంగచేతికి తాళాలిచ్చినట్టే. ఇటీవల జరిగిన ఒక సర్వే ఏం చెబుతోంది? హైజీన్‌ పాస్‌వర్డ్‌ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పాస్‌వర్డ్‌ పెడుతున్నప్పుడు చాలామంది చేస్తున్న తప్పేమిటంటే... దానిని పేపర్‌ మీద రాసుకోవడం గానీ, ఎలక్ర్టానిక్‌ ఫార్మాట్‌లో భద్రపరచడంగానీ చేస్తున్నారు. అలాగే పుట్టిన తేదీ, పెట్‌ నేమ్‌, కుటుంబసభ్యుల పేర్లు పెడుతున్నారు. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోవడం వల్ల వాటిని హ్యాకర్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఆఫీసుల్లో అయితే ఐటీ టీమ్‌ ‘వెల్కం123’ లాంటి తాత్కాలిక పాస్‌వర్డ్‌ ఇస్తుంది. చాలామంది ఉద్యోగులు వాటిని మార్చుకోకుండా కంటిన్యూ చేస్తున్నారు.


పాస్‌వర్డ్‌ చోరీ జరిగిందని అనుమానం వస్తే చెక్‌ చేసుకునేందుకు కొన్నివెబ్‌సైట్స్‌ ఉన్నాయి. ‘అవాస్ట్‌’, ‘ఎఫ్‌-సెక్యూర్‌ ఐడెంటిటీ థెఫ్ట్‌ చక్కర్‌’, ‘సైబర్‌న్యూస్‌’, ‘నోట్రాన్‌’, ‘లీక్‌చెక్‌’ వంటి వెబ్‌సైట్లు ఈ విషయంలో అవగాహనను పెంచుతాయి.

2024లో హ్యాక్‌ చేసిన పాస్‌ వర్డ్‌లలో (టాప్‌ 200 పాస్‌వర్డ్స్‌ 2024) భారతీయులు అత్యధికంగా వాడుతున్న వాటిలో టాప్‌ 5 ఏమిటంటే... 123456, పాస్‌వర్డ్‌, 12345678, 123456789, ఎబిసిడి1234. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే... 123456, 12345789, 12345678, పాస్‌వర్డ్‌, క్వెర్టీ123 లు ఉన్నాయి.


సాంప్రదాయ పాస్‌వర్డ్‌ల కన్నా... బయోమెట్రిక్‌

(వేలిముద్ర, ముఖ గుర్తింపు) మేలు. ఫోర్జరీ చేయడం కష్టమవుతుంది. ఫిషింగ్‌లాంటివి జరగవు.

నచ్చిన వారి పేర్లు, పుట్టినతేదీ, వరుస నెంబర్ల వంటివి పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటే సైబర్‌ చోరుల పని సులువవుతుంది.

చాలామంది పాస్‌వర్డ్‌ ఎవరూ కొట్టేయలేరని అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు కానీ...

ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో వాటిలో 78 శాతం కేవలం

ఒక సెకనులోనే ‘క్రాక్‌’ చేయొచ్చని తేలింది.


పాస్‌వర్డ్‌ ఎప్పుడైనా బలంగా ఉండాలి. చిన్నగా కాకుండా, కనీసం 8-13 క్యారెక్టర్లు ఉండేలా చూసుకోవాలి. పెద్దవి, చిన్నవి, నంబర్లు,

ప్రత్యేక గుర్తులు కలిపి పెట్టుకుంటేనే సేఫ్‌.

రకరకాల అకౌంట్లకు దేని పాస్‌వర్డ్‌ దానికే ఉండాలి. అంతేగానీ అన్నింటికీ

ఒకే పాస్‌వర్డ్‌ ఉపయోగించడం మంచిది కాదు.

పాస్‌వర్డ్‌ను ప్రతీ మూడు నెలలకు ఒకసారి మార్చుకోవడం మంచిదని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల 18 వేల 50 మంది పాస్‌వర్డ్‌ 123456. మన దేశంలో ఇదే పాస్‌వర్డ్‌ను 76,981 మంది పెట్టుకున్నట్టు తేలింది.

Updated Date - Dec 15 , 2024 | 07:49 AM