అర్థం చేసుకోవాల్సిందే
ABN , Publish Date - Oct 06 , 2024 | 11:05 AM
ఔషధాల శిఖరం, సరికొత్త నృత్యకారుడు, కోడి కాళ్లున్న విచిత్ర పుష్పం... ఇవన్నీ కళాకారుడి ఆలోచనల నుంచి ఆవిష్కృతమైన కళాఖండాలు. లండన్‌లోని రీజంట్ పార్కులో ఇటీవలే ప్రారంభమైన ‘ఫ్రీజ్ స్కల్ప్చ్‌ర్ 2024’లోని కొన్ని అద్భుతాలివి.
ఔషధాల శిఖరం, సరికొత్త నృత్యకారుడు, కోడి కాళ్లున్న విచిత్ర పుష్పం... ఇవన్నీ కళాకారుడి ఆలోచనల నుంచి ఆవిష్కృతమైన కళాఖండాలు. లండన్‌లోని రీజంట్ పార్కులో ఇటీవలే ప్రారంభమైన ‘ఫ్రీజ్ స్కల్ప్చ్‌ర్ 2024’లోని కొన్ని అద్భుతాలివి. లియోనారా కారింగ్టన్, తీస్టర్ గేట్స్, యోషిమతో నారా లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన 22 మంది కళాకారులు రూపొందించిన శిల్పాలను ఇక్కడ చూడొచ్చు. సరికొత్తగా, ప్రయోగాత్మకంగా, సామాజిక కోణంలో రూపొందించిన కళారూపాలే ఇవన్నీ. వీటిని అర్థం చేసుకోవడానికి కళాభిమానులు కాస్త సమయం కేటాయించాల్సిందే. అందుకే సందర్శకులు ఒక్కో ఆకృతి దగ్గర అలా ఉండిపోతున్నారు. వాటి వెనుక అర్థం పరమార్థాన్ని గ్రహించి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.