Share News

Kalashtami: రాహు, కేతు దోషాలు పోగొట్టే ‘కాలాష్టమి’.. ఏరోజు వస్తోంది.. నల్ల శునకాలకు ఇవి తినిపించండి

ABN , Publish Date - Nov 16 , 2024 | 06:13 PM

రాహు, కేతువు వంటి గ్రహదోషాల నుంచి విముక్తి పొందేందుకు కాళహస్తి వెళ్లి పూజలు చేయిస్తుంటారు. కాలాష్టమి రోజున చేసే పరిహారాలు కూడా ఈ పూజలకు సమానమైన ఫలితాన్ని ఇస్తాయంటారు..

Kalashtami: రాహు, కేతు దోషాలు పోగొట్టే ‘కాలాష్టమి’.. ఏరోజు వస్తోంది.. నల్ల శునకాలకు ఇవి తినిపించండి
kalashtami

కార్తీక మాసంలో వచ్చే అతి పవిత్రమైన రోజుల్లో కాలాష్టమి ఒకటి. కార్తీక పౌర్ణమి ముగిసిన తర్వాత వచ్చే తొలి అష్టమినే కాలాష్టమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 23న ఈ దివ్యమైన రోజు వస్తోంది. ఎవరి జాతకంలో అయితే రాహు, కేతు దోషాలు ఉంటాయో వారికి ఇది ఎంతో ముఖ్యమైన రోజు. రాహు, కేతు గ్రహాలు వ్యక్తి జాతకంలో చెడు ఫలితాలను ఇచ్చినట్టైతే.. ఆలోచనల్లో స్థిరత్వం లేకపోవడం, వృత్తిలో నిలకడ లేకపోవడం, భౌతిక విషయాలపై అనాసక్తి, కుటుంబ, వైవాహిక జీవితంలో సమస్యలు వంటివి వేధిస్తుంటాయి. ఇలాంటి వారు కాలాష్టమి రోజున చేసే పూజలు కచ్చితంగా సత్ఫలితాలనిస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తున్నారు. అసలు కాలాష్టమి రోజున పూజా విధానం ఏమిటి, ఎలా ఆచరించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం..


కాలభైరవుడిని పూజించే రోజు..

శివారాధన చేసే వారు కచ్చితంగా కాలాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రతి మాసంలోనూ కాలాష్టమి తిథి వచ్చినప్పటికీ కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమికి ఎంతో విశిష్టత ఉంది. పరమ శివుడికి మరో రూపమైన కాల భైరవుడిని ఈరోజు అర్చిస్తారు. అందుకే దీనిని భైరవాష్టమి అని కూడా అంటారు. ఈ రోజున భక్తులు ఉపవాస దీక్షలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటారు.


నల్ల శునకాలకు ఆహారం...

కాలభైరవుడిని సాయంత్రం వేళ పూజిస్తుంటారు. కొన్ని శివాలయాల్లో కాలభైరవుడి రూపు ఉంటుంది. ఆయనకు ఆవ నూనెతో దీపారాధన అంటే ఎంతో ప్రీతి. ఈ దీపాన్ని వెలిగిస్తే భైరవుడి అనుగ్రహం పొందుతారని చెప్తారు. కాలాష్టమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, స్నానం ఆచరించడం చేస్తారు. వీధుల్లో కనిపించే నల్ల రంగులో ఉండే శునకాలను సాక్షాత్తు కాలభైరవుడి స్వరూంగా భావిస్తారు. వీటికి పొట్టు మినప్పప్పుతో చేసిన గారెలు, పెరుగన్నం ఆహారంగా ఇస్తారు.


గ్రహ భాధలు తొలగినట్టే..

కాలాష్టమి వ్రత కథను ఈరోజున చదువుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయంటారు. భైరవుడికి కొబ్బరికాయ, నల్ల బెల్లం, రొట్టెలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల జాతకంలో రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందంటారు. అంతేకాదు దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి వంటి వాటితో బాధపడుతున్న వారు ఈ రోజు ప్రత్యేక పూజలు చేయడం వల్ల వీటి నుంచి బయటపడతారని భక్తుల నమ్మకం.


నల్లబట్టలే ఎందుకు..

నలుపు రంగు కాలభైరవుడిని సూచిస్తుంది. అందుకే ఈ దేవుడిని పూజించేవారు ఈ రంగు దుస్తులు వేసుకుంటారు. నల్ల రంగు దుస్తులను ధరించడం వల్ల సులభంగా భైరవుడి కృపకు పాత్రులు కావచ్చంటారు.

Today Horoscope : ఈ రాశి వారు సహోద్యోగుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు.


Updated Date - Nov 16 , 2024 | 06:19 PM