Kerala: ప్రొఫెషనల్‌గా ప్రొఫెసర్.. ఏమైందంటే..
ABN , Publish Date - Aug 31 , 2024 | 09:57 AM
ప్రొఫెసర్ అరుణిమ చీర కట్టుకుని డ్యాన్స్ చేశారు. స్నీకర్స్ వేసుకొని, కాలా ఛష్మకు పాటకు ఓ ఊపు ఊపారు. ప్రొఫెసర్ ఎనర్జీని చూసి పక్కన ఉన్న స్టూడెంట్స్ మరింత ఉత్సహ పరిచారు. ప్రొఫెసర్ డ్యాన్స్ చేసిన వీడియోను ఓ స్టూడెంట్ సోషల్ మీడియా ఇన్ స్టలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
కాలేజీల్లో ఈవెంట్స్ జరిగితే స్టూడెంట్స్ డ్యాన్స్ చేయడం కామన్. వివిధ రకాల పాటలతో విద్యార్థులు జోరుగా స్టెప్పులేస్తుంటారు. విద్యార్థులతో పోటీ పడి టీచర్లు డ్యాన్స్ చేస్తే.. ఆ కిక్కే వేరు అంటోంది కేరళలో ఓ కాలేజీ. ఎర్నాకులంలో గల సెయింట్ థెరిసా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణిమ దేవశిష్ డ్యాన్స్‌తో హోరెత్తించారు. ఆమె రాకతో మిగతా టీచర్లు స్టేజీ మీదకొచ్చి, డ్యాన్స్‌తో ఇరగదీశారు.
చీర కట్టుకొని..
ప్రొఫెసర్ అరుణిమ చీర కట్టుకుని డ్యాన్స్ చేశారు. స్నీకర్స్ వేసుకొని, కాలా ఛష్మకు పాటకు ఓ ఊపు ఊపారు. ప్రొఫెసర్ ఎనర్జీని చూసి పక్కన ఉన్న స్టూడెంట్స్ మరింత ఉత్సహ పరిచారు. ప్రొఫెసర్ డ్యాన్స్ చేసిన వీడియోను ఓ స్టూడెంట్ సోషల్ మీడియా ఇన్ స్టలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. వీడియోపై ర్యాపర్ బాద్ షా కూడా స్పందించారు.
క్లాస్ రూమ్‌లోకి వచ్చిన తర్వాత..
‘ఆ ఈవెంట్‌కు అరుణిమ మరింత కళ తీసుకొచ్చారు. డ్యాన్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. అరుణిమ కూలెస్ట్ టీచర్ అని’ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ మరుసటి రోజు టీచర్ తరగతి గదిలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అని ఒకరు, ఆ షోలో టీచర్ ఉత్తమ ప్రదర్శన ఇచ్చారని ఇంకొకరు.. టీచర్ రాక్డ్.. స్టూడెంట్స్ షాక్డ్ అని ఇంకొకరు పోస్ట్ చేశారు. ఆ టీచర్ ప్రొఫెసనల్ డ్యాన్సర్ మాదిరిగా ఉందని ఇంకొకరు రాసుకొచ్చారు. ప్రొఫెసర్ అరుణిమకు ఇన్ స్టాలో 6 వేల మంది ఫాలొవర్లు ఉన్నారు.
For Latest News click here