Indian Railway Coaches: భారతీయ రైళ్లల్లో ఎరుపు, నీలం బోగీల మధ్య తేడా తెలుసా?
ABN , Publish Date - Oct 29 , 2024 | 07:30 AM
భారతీయ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఐసీఎఫ్ నీలి రంగు బోగీలు ఉంటాయట. రాజధాని వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లల్లో ఎల్‌హెచ్‌బీ బోగీలు వినియోగిస్తారని నిపుణులు చెబుతారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైళ్లల్లో నిత్యం లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. రైలు ప్రయాణ అనుభవం దేశంలో దాదాపు అందరికీ ఉన్నప్పటికీ ఈ వ్యవస్థపై చాలా మందికి పూర్తి అవగాహన ఉండదనే చెప్పాలి. ఉదాహరణకు కొన్ని భారతీయ రైళ్లల్లో ఎరుపు బోగీలు ఉంటే మరికొన్నింటిలో నీలి రంగు బోగీలు ఉంటాయి. వీటి మధ్య తేడా ఏంటనే సందేహం ఎప్పుడైనా కలిగిందా? అయితే, ఈ కథనం మీ కోసమే (Viral)!
Viral: గూగుల్‌ను కోర్టుకు ఈడ్చీ.. 2 బిలియన్ పౌండ్ల జరిమానా పడేలా చేసి..
భారతీయ రైళ్లల్లో ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ బోగీలు, లింక్ హాఫ్‌మన్ బుష్ బోగీలు ఉంటాయి. ఐసీఎఫ్ బోగీలు నీలి రంగులో ఉంటే ఎల్‌హెచ్‌బీ బోగీలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ రెండిటి మధ్య మౌలికమైన తేడాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నీలిరంగు ఐసీఎఫ్ బోగీలు సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కనిపిస్తే ఎల్‌హెచ్‌బీ బోగీలు మాత్రం రాజధాని, ఇతర సూపర్ ఫాస్ట్ ప్రీమియం రైళ్లల్లో మాత్రమే కనిపిస్తాయి. ఎల్‌హెచ్‌బీ బోగీలు , ఐసీఎఫ్ బోగీలకంటే మరింత భద్రమైనవి, సౌకర్యవంతమైనవి. వీటిని యాంటీ టెలిస్కోపిక్ డిజైన్ ఆధారంగా తయారు చేయడంతో రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు బోగీలు ఒకదానిమీద ఒకటి పడవు. కాబట్టి, వీటిని గంట 200 కిలోమీటర్ల వరకూ వేగంతో ప్రయణించే రైళ్లల్లో వినియోగిస్తారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను 2000 సంవత్సరం నుంచి రైళ్లల్లో వినియోగిస్తున్నారు. వీటిని పంజాబ్‌లోని కపుర్తల కోచ్ ఫ్యాక్టరీలో నిర్మిస్తారు. వీటి ఎరుపు రంగు ప్రీమియం రైళ్లల్లో వాడకానికి సంకేతం.
Viral: రోడ్డుపై దొరికిన కరెన్సీ నోటుతో లాటరీ టిక్కెట్ కొంటే..
ఇక నీలి రంగు బోగీలను చెన్నైలోని ఫ్యాక్టరీలో రూపొందిస్తున్నారు. ఈ బోగీల్లో ఎయిర్ బ్రేకులు వినియోగిస్తారు. దీని మెయింటెనెన్స్ ఖర్చుతో కూడుకున్నదని కూడా నిపుణులు చెబుతున్నారు. ఈ బోగీల జీవిత కాలం 25 ఏళ్లట. సాధారణ రైళ్లల్లో ఎక్కువగా కనిపించేవి ఈ బోగీలే. ఇవి గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. చెన్నైలోని ఇంటెగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలలోని రెయిల్ కోచ్ ఫ్యాక్టరీ, రాయ్‌బరేలీలోని మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ, వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్, పశ్చిమబెంగాల్‌లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ ఫ్యాక్టరీల్లో భారతీయ రైళ్లల్లో వినియోగించే వివిధ రకాల బోగీలను నిర్మిస్తారు.
రూ.8 కోట్లు ఇవ్వలేదని భర్తను హత్య చేసి.. పోలీసులకు దొరక్కుండా..