Share News

Diwali 2024: దీపావళి అలంకరణ.. ఈ టిప్స్‌తో ఇంట్లో వెలుగులు రెట్టింపు

ABN , Publish Date - Oct 31 , 2024 | 08:33 AM

దీపావళి అంటేనే వెలుగుల పండుగ. ఈ రోజు ఇంటిని మరింత అందంగా అలంకరించేందుకు, అతిథులను సర్‌ప్రైజ్ చేసేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.

Diwali 2024: దీపావళి అలంకరణ.. ఈ టిప్స్‌తో ఇంట్లో వెలుగులు రెట్టింపు

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి అంటేనే వెలుగుల పండుగ. ఈ రోజు ఇంటిని మరింత అందంగా అలంకరించేందుకు, అతిథులను సర్‌ప్రైజ్ చేసేందుకు కొన్ని టిప్స్ పాటించాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు (Diwali decorations tips).

ఈ రోజు ఇల్లు దీప కాంతులతో కళకళలాడాలంటే వీలైనన్ని ఎక్కువ దీపాలు అమర్చాలి. ఇంటి ఎంట్రన్స్, ప్రతి గదిలోని మూలలు, పూజ గదిలో దీపాలు అమర్చుకుంటే ఇంటికి కొత్త కళ వస్తుంది.

చామంతి, బంతి తదితర పూల రేకులపై దీపపు ప్రమిదలు పెడితే ఇంటికే కొత్త అందం వస్తుంది. దీనికి తోడు వాటిపై గ్లిట్టర్ జల్లితే అలంకరణ మరింత దేదిప్యమానం అవుతుంది.

5.jpg


ఇంట్లో మెట్లు, ద్వారాలు, కిటికీలకు బంతిపూల దండలు అమర్చితే పండగ ఉత్సాహం రెట్టింపవుతుంది.

ఇక గుమ్మం ముందు రంగుల మగ్గులు వేసి వాటిపై దీపాలు పెడితే చూడముచ్చటగా ఉంటుంది. ఇంటికొచ్చే అతిథులు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కొత్తదనం ఉట్టిపడేలా వైవిధ్యమైన ముగ్గులు వేస్తే మరింత అందంగా ఉంటుంది. అంతేకాకుండా, ఆతిథులకు ఆహ్వాన సందేశాలను పూలరేకులతో అలంకరించినా అద్భుతంగా ఉంటుంది.

ఇక ఇంట్లోని షాండలియర్ల వంటి వివిధ రకాల అలంకరణ వస్తువుల చూట్టూ సీరియస్ లైట్లు ఏర్పాటు చేస్తే ఇల్లంతా దేదిప్యమానంగా వెలిగిపోతుంది. వీటిని టేబుల్స్ లేదా కిటికీలకు కూడా అమర్చుకోవచ్చు.

3.jpg


వీటితో పాటు పేపర్, దారం లేదా ఇతర వస్తువులతో ఎవరికి వారు స్వయంగా చేసుకోగలిగిన లాంతర్లను ఇంట్లో వేలాడదీసినా చూసే వారికి ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇంటికి తోరణాలు తెచ్చే అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పూలతో పాటు సీరియల్ లైట్స్‌ను కూడా తోరణాలుగా వాడితే ఇంటి లుక్ మారుతుంది.

రంగు రంగుల పేపర్ స్ట్రిప్స్‌ను రకరకాల డిజైన్లలో అల్లి పెద్ద పెద్ద దీపపు కుందెల చుట్టూ తోరణాల్లా అలంకరిస్తే వాటి అందం ఇనుమడిస్తుంది.

ఇక ఇంట్లో అనవసర వస్తువులను వదిలించుకుంటే గదులు మరింత విశాలంగా కనిపిస్తాయి. అలంకరణలు మరింత అందాన్ని ఇస్తాయి.

1.jpgRead Latest and Viral News

Updated Date - Oct 31 , 2024 | 09:32 AM