Share News

Viral Video: ముళ్ల పందిని పట్టుకోబోయి గాయపడిన చిరుత.. తర్వాతేం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..!

ABN , Publish Date - May 22 , 2024 | 11:25 AM

అడవుల్లో సంచరించే ముళ్ల పందులను వేటాడడం సామాన్య విషయం కాదు. దాని శరీరంపై ఉండే ముళ్లు గుచ్చుకుంటే ఎంతటి జంతువైనా బాధతో విలవిలలాడాల్సిందే. అందుకే చాలా జంతువులు వాటి జోలికి వెళ్లవు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ ముళ్ల పందిపై చిరుత దాడి చేసేందుకు ప్రయత్నించి గాయపడింది.

Viral Video: ముళ్ల పందిని పట్టుకోబోయి గాయపడిన చిరుత.. తర్వాతేం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..!
Leopard hunting a porcupine

అడవుల్లో సంచరించే ముళ్ల పందులను (Porcupine) వేటాడడం సామాన్య విషయం కాదు. దాని శరీరంపై ఉండే ముళ్లు గుచ్చుకుంటే ఎంతటి జంతువైనా బాధతో విలవిలలాడాల్సిందే. అందుకే చాలా జంతువులు వాటి జోలికి వెళ్లవు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ ముళ్ల పందిపై చిరుత (Leopard) దాడి చేసేందుకు ప్రయత్నించి గాయపడింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి చివరకు విజయం సాధించింది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ కల్లమ్ పెర్రీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు (Viral Video).


callumjperry అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఆ వీడియోలో ఓ ముళ్ల పందిని ఓ చిరుత వెంటాడుతూ రోడ్డు మీదకు వచ్చింది. ఆ పందిపై చిరుత కాలు వేసినపుడు అది తన ముళ్లతో దాడి చేసింది. కొన్ని ముళ్లు చిరుత కాలికి గుచ్చుకున్నాయి. చిరుత తన నోటితో ఆ ముళ్లను తీసుకుని మళ్లీ పరిగెత్తి ఆ పందిని వెంబడించింది. చివరకు ఎలాగోలా ఆ ముళ్ల పంది పీక పట్టుకుంది. ఆ సమయంలో ఓ హైనా వచ్చింది. దీంతో ఆ పంది ఆ హైనాకు దొరక్కుండా ఉండేందుకు చిరుత చెట్టు పైకి ఎక్కేసింది (Leopard hunting a porcupine).


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చిరుత పులి వేట నైపుణ్యాలు సాధారణమైనవి కావు``, ``అద్భుతమైన వీడియో బ్రదర్``, ``దెబ్బ తగిలినా పులి వెనుకడుగు వేయలేదు``, ``ఆహా.. చిరుతకు రుచికరమైన భోజనం దొరికింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Opitcal Illusion: మీ దృష్టి నైపుణ్యానికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉడుత ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి!


Viral Video: వామ్మో.. ఫోన్ పిచ్చి పడితే ఇలాగే ఉంటుందేమో! ఆ మహిళ తెలివి చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2024 | 11:25 AM