Life Lesson: ఈ 4 విషయాలలో ఎప్పుడూ సిగ్గు పడకండి.. చాలా నష్టపోతారు..!
ABN , Publish Date - Aug 31 , 2024 | 04:05 PM
స్త్రీకి సిగ్గు ఆభరణం అని అన్నారు. మహిళలు కూడా కొన్ని సందర్భాలలో సిగ్గు పడితేనే బాగుంటుంది. కానీ కొందరు జెండర్ తో సంబంధం లేకుండా కొన్ని విషయాలలో సిగ్గు పడుతుంటారు.
స్త్రీకి సిగ్గు ఆభరణం అని అన్నారు. మహిళలు కూడా కొన్ని సందర్భాలలో సిగ్గు పడితేనే బాగుంటుంది. కానీ కొందరు జెండర్ తో సంబంధం లేకుండా కొన్ని విషయాలలో సిగ్గు పడుతుంటారు. ఇలా సిగ్గు పడటాన్నే మొహమాట పడటం అని కూడా అంటుంటారు. కానీ నీతి శాస్ర్త పుస్తకంలో ఆచార్య చాణక్యుడు చాలా విషయాలు ప్రస్తావించాడు. ముఖ్యంగా జీవితంలో నాలుగు విషయాల దగ్గర సంకోచం, సిగ్గు, మొహమాటం అనేవి ఉండకూడదని.. అవి ఉండటం వల్ల చాలా నష్టపోతారని, విజయాలు చేరుకోలేరని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ నాలుగు విషయాలు ఏంటో తెలుసుకుంటే..
Viral: వయనాడ్ విషాదం ముంగిట కదిలించే ప్రేమ కథ..!
డబ్బు..
ఆచార్య చాణక్యుడు డబ్బుకు సంబంధించిన విషయాలలో ఎప్పుడూ సిగ్గు పడకూడదని చెప్పాడు. ఎవరికైనా మీరు డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే దాన్ని తిరిగి అడటంలో కానీ, కష్టపడి పనిచేసినందుకు రావాల్సిన మొత్తాన్ని అడగడంలో కానీ సిగ్గు పడటం మంచిది కాదు. ఆర్థిక విషయాల దగ్గర మొహమాట పడితే భవిష్యత్తులో చాలా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది.
ఆహారం..
చాలా మంది ఆహారం దగ్గర ఎక్కువ మొహమాట పడతారు. ఎక్కువ తిన్నా, లేదా ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకుని తిన్నా తమను తప్పుగా అనుకుంటారేమో అనే బిడియం, మొహామాటం వారిలో ఉంటాయి. కానీ నిజానికి ఆకలిలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎవరూ మొహమాట పడకూడదు. ఆకలిని తృప్తి పరచకుండా మనసును నియంత్రించడం కష్టం. ఆకలితో ఉంటే ఆలోచించే సామర్థ్యం తగ్గుతుంది. కోపం కూడా పెరుగుతుంది. కాబట్టి ఆహారం దగ్గర మొహమాట పడకూడదు.
ఈ 6 రకాల విత్తనాలను నానబెట్టిన తర్వాతే తినాలి.. ఎందుకంటే..!
విద్య..
విద్య నేర్చుకోవడంలో ఎప్పుడూ భయం, మొహమాటం, సిగ్గు ఉండకూడదు. తమ కంటే చిన్న వారు బోధకులుగా ఉన్నప్పుడూ, లేక ఎవరూ సందేహం అడగలేదు కాబట్టి తాము అడిగితే బాగుండదనో కొందరు తరగతులలో విషయాలు తెలుసుకోకుండా ఆగిపోతారు. కానీ ఇది మంచిది కాదు. సందేహాలు అడిగేవాడే మంచి విద్యార్థి. తన ప్రశ్నలకు సందేహాలు తీర్చుకునేవాడే విద్యలో మెరుగ్గా ఉండగలడు.
అభిప్రాయాలు..
కొందరికి తప్పు, ఒప్పుల మధ్య తేడా తెలిసినా సరే.. మాట్లాడటానికి, దాని గురించి చెప్పడానికి సంకోచిస్తారు. వారిలో అంతర్లీనంగా ఉన్న మొహమాటం, సిగ్గు, భయం వారిని మాట్లాడనీయదు. ఇలాంటి వారు జీవితంలో ముందుకు సాగలేరు. మొహమాటం, సిగ్గు కారణంగా తమ ఆలోచినలను అణచివేసేవారు సంకోచం లోనే ఉండిపోతారు. జీవితంలో ముందుకు సాగాలంటే ఖచ్చితంగా తమ అభిప్రాయాలను కూడా తెలియజేయాలి.
ఈ ఉదయపు చెడ్డ అలవాట్ల వల్ల బరువు పెరుగుతారట..!
విటమిన్-సి ఆడవాళ్ల కంటే మగవారికే ఎక్కువ ముఖ్యం.. ఎందుకంటే..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.