Life Lesson: రిజెక్డ్ అవ్వగానే బాధపడుతున్నారా.. ఈ 5 విషయాలు తెలుసుకోండి..
ABN , Publish Date - Oct 20 , 2024 | 03:37 PM
ఉద్యోగం, ప్రేమ, స్నేహం, కుటుంబ సభ్యులు. ఇలా ప్రతి చోట ఏదో ఒక దశలో తిరస్కరణకు గురవుతూ ఉంటాం. అలా రిజెక్ట్ అవ్వడం మాటల్లో వర్ణించలేని బాధను పరిచయం చేస్తుంది. దీన్ని డీల్ చేయాలంటే ఇలా ఛేయండి.
రిజెక్ట్ లేదా తిరస్కారం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో చాలా సహజంగా ఎదురయ్యే అనుభవం. స్నేహం, ప్రేమ, ఉద్యోగంతో పాటు జీవితంలో ఎన్నో విషయాల దగ్గర రిజెక్షన్ ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని చిన్న విషయాలు అయితే ఎక్కువగా పట్టించుకోరు కానీ జీవితంలో ముఖ్యమైన విషయాలైన ప్రేమ, ఉద్యోగం, స్నేహం, కుటుంబ సభ్యుల దగ్గర తిరస్కరణకు లోనైతే కలిగే బాధ వర్ణనాతీతం. ఆ పరిస్థితిని డీల్ చేయడం చాలా కష్టం. చాలామంది ఈ పరిస్థితి నుండి బయట పడటానికి చాలా సతమతం అయ్యే వారు ఉంటారు. కానీ ఈ కింది విషయాలు తెలుసుకుంటే రిజెక్షన్ తర్వాత కూడా సంతోషంగా ఉండొచ్చు.
Health Tips: 60 ఏళ్ల వయసులోనూ 25ఏళ్లలా ఉత్సాహంగా ఉండాలంటే.. ఈ డ్రింక్స్ తాగండి చాలు..
కరుణ..
కరుణ వ్యక్తిని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. రిజెక్ట్ కావడం అనేది తనను తక్కువ చేయడం అనే భావన తగ్గించుకోవాలి. తనకు తాను నచ్చజెప్పుకోవాలి. సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. వృత్తిపరంగా అయినా, వ్యక్తిగతంగా అయినా ముందుకు వెళ్లడమే సరైన మార్గమని అర్థం చేసుకోవాలి. రిజెక్ట్ అవగానే తమను తాము కష్టపెట్టుకునేవారు, ద్వేషించుకునేవారు, కోప్పడేవారు ఎక్కువ. కానీ అలాంటి సందర్భంలోనే వ్యక్తిగత శ్రద్ద, తమ గురించి తాము ఆలోచించుకోవడం అవసరం అవుతుంది.
సహాయం..
రిజెక్ట్ కాబడినప్పుడు దాన్నుండి బయట పడటానికి చాలామందికి కష్టంగా ఉంటుంది. దీన్నుండి బయట పడాలంటే స్నేహితులు, కుటుంబ సభ్యులు, కొలీగ్స్, ఆత్మీయులతో మెసేజ్ ల ద్వారా, ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా కానీ నేరుగా కలవడం ద్వారా కానీ టచ్ లో ఉండాలి. అందరితోనూ కలుస్తుంటే బాధ నుండి తొందరగా బయటపడతారు.
కొత్త లక్ష్యాలు..
రిజెక్ట్ ఎదురైనప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండటం కంటే కొత్త లక్ష్యాలను నిర్థేశించుకుని వాటిని సాధించే దిశగా ప్రయాణించడం ముఖ్యం. దీన్ని వల్ల సమయం సద్వినియోగం అవుతుంది. ఎదురైన చేదు అనుభవాల నుండి తొందరగా బయటకు వస్తారు. అంతే కాదు.. కొత్త లక్ష్యాలు సాధించడం వల్ల ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది.
Arthritis: ఆర్థరైటిస్ సమస్యకు ఆయుర్వేదం చెప్పిన అదిరిపోయే చిట్కా..
అలవాట్లు..
కొన్ని విషయాలు మరచిపోవాలంటే కొన్ని పనులలో చాలా లోతుగా లీనమవ్వాలి. శారరీక శ్రమ కలిగించేవి అయినా, కళాత్మకతతో కూడుకున్నవి అయినా, కొత్త నైపుణ్యాలు నేర్చుకునేవి అయినా, ముఖ్యంగా ఇష్టమైన అభిరుచులను సాధన చేయడం వల్ల మానసిక స్థితి దృఢంగా మారుతుంది.
పరిశీలన..
ఎందుకు రిజెక్ట్ కాబడ్డాం అనే విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దేని వల్ల ఇలా జరిగింది అనే విషయం అర్థం కావడానికి జరిగిన విషయం అంతా రాసుకోవాలి. వాటిలో రిజెక్ట్ కావడానికి కారణాన్ని గుర్తించాలి. ఇలా చేయడం వల్ల ఇంకోసారి ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతారు.
ఇవి కూడా చదవండి..
జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?
ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.