Share News

Life Lesson: గాడిదను తేలిగ్గా తీసిపారేయకండి.. దీన్నుండి నేర్చుకోవాల్సిన 5 విషయాలు ఇవే..!

ABN , Publish Date - May 13 , 2024 | 02:35 PM

పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇలా ఎవరైనా సరే.. చిన్నవాళ్లను, బద్దకంగా ఉన్నవాళ్లను తిట్టడానికి ఉపయోగించే పదాలలో ముఖ్యంగా గాడిద అనే పదం ఎక్కువగా ఉంటుంది. చాలా బద్దకంగా, నిర్లక్ష్యంగా ఉంటుందని, ఎవరేమన్నా, ఎంత కొట్టినా పెద్దగా చలించదని గాడిదను పోల్చి చెబుతుంటారు. అయితే గాడిదను తక్కువ చేసి చూడకూడదు.

Life Lesson: గాడిదను తేలిగ్గా తీసిపారేయకండి.. దీన్నుండి నేర్చుకోవాల్సిన 5 విషయాలు ఇవే..!

పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇలా ఎవరైనా సరే.. చిన్నవాళ్లను, బద్దకంగా ఉన్నవాళ్లను తిట్టడానికి ఉపయోగించే పదాలలో ముఖ్యంగా గాడిద అనే పదం ఎక్కువగా ఉంటుంది. చాలా బద్దకంగా, నిర్లక్ష్యంగా ఉంటుందని, ఎవరేమన్నా, ఎంత కొట్టినా పెద్దగా చలించదని గాడిదను పోల్చి చెబుతుంటారు. అయితే గాడిదను తక్కువ చేసి చూడకూడదు. నేర్చుకోవాలనుకుంచే గాడిదలోనూ మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఇంతకీ గాడిద నుండి ఏమేం నేర్చుకోవచ్చో తెలుసుకుంటే..

శ్రమ..

అధింకంగా శ్రమ పడటం గాడిదలో ఉన్న లక్షణం. ఎంత చాకిరీ అయినా అవి చేస్తాయి. మనిషి కూడా అంకిత భావంతో కష్టపడటాన్ని గాడిదల నుండి నేర్చుకోవచ్చు. కష్టపడి పనిచేసేవారికి విజయం ఎప్పటికైనా లభిస్తుందన్న విషయం తెలిసిందే.

55ఏళ్ళ తర్వాత కూడా మహిళలు ఫిట్ గా ఉండాలంటే ఈ పనులు చెయ్యాలి!


పట్టింపు..

ఏదైనా పని చేసేటప్పుడు ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన మనుషులలో ఉంటుంది. కానీ గాడిదకు అలాంటివి ఉండవు. ఏ పని చెప్పినా, తన మీద ఏ బరువు వేసినా మోయడం మాత్రమే దానికి తెలుసు. అదే విధంగా చేసే పనిని చిన్నతనంగా చూడకుండా కష్టపడి చేయాలని గాడిద నుండి తెలుసుకోవచ్చు.

నిర్లక్ష్యం..

కొన్ని విషయాలలో నిర్లక్ష్యం కూడా మంచిదేనని గాడిదను చూసి తెలుసుకోవచ్చు. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు, చేసే పనిని ఎగతాళి చేసి మాట్లాడనప్పుడు ఇతరుల మాటలను అంతగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేయాలి. అలా చేస్తేనే జీవితంలో ఏ పనిని నామోషీగా భావించకుండా చేసుకోగలుగుతారు.

వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!


వెనకడుగు..

గాడిద మీద ఎంత బరువు వేసినా అది మోసుకుంటూ వెళుతుందే తప్ప వెనకడుగు వేయదు. మనిషి కూడా అంతే.. జీవితంలో ఎన్ని బాధలు, ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎవరి సహాయం అర్థించకుండా తన పని తాను చేసుకుపోవాలి. ఇలా చేయడం వల్ల తన మీద తనకు కాన్పిడెంట్ పెరుగుతుంది.

దృఢంగా..

శారీరక బలం కంటే మానసిక బలం మనిషిని గొప్పగా తీర్చిదిద్దుతుంది. గాడిద కూడా శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ దాని మానసిక బలం మరింత గొప్పగా ఉంటుంది. మానసిక బలం కారణంగానే అది ఎంత భారాన్ని అయినా మోయగలుగుతుంది. ఎండ వానలను సైతం లెక్కచేయకుండా ముందుకు కదులుతుంది. మనిషి కూడా అలా మానసికంగా బలంగా ఉండాలి.

55ఏళ్ళ తర్వాత కూడా మహిళలు ఫిట్ గా ఉండాలంటే ఈ పనులు చెయ్యాలి!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 13 , 2024 | 06:01 PM