Share News

Life Lesson: ఎంత ట్యాలెంట్ ఉన్నా సరే.. ఈ 7 అలవాట్లు ఉన్నవారు జీవితంలో ఎదగలేరు..!

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:42 PM

ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి కొన్ని దోహదం చేసినట్లే జీవితంలో ఎదుగుదల లేకపోవడానికి కూడా కొన్ని కారణం అవుతాయి. కింది 7 అలవాట్లు ఉన్న వ్యక్తులు జీవితంలో అసలు ఎదగలేరని..

Life Lesson: ఎంత ట్యాలెంట్ ఉన్నా సరే.. ఈ 7 అలవాట్లు ఉన్నవారు జీవితంలో ఎదగలేరు..!
Life Lesson

ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటాడు. అందుకోసం చాలా కష్టపడతారు. కొందరికి స్వతహాగా అబ్బిన తెలివితేటలు, ఆలోచనా పరిజ్ఞానం, అర్థం చేసుకునే లక్షణం వారి జీవితం ఉన్నత స్థాయికి వెళ్లడానికి తోడ్పడుతుంది. అయితే ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి కొన్ని దోహదం చేసినట్లే జీవితంలో ఎదుగుదల లేకపోవడానికి కూడా కొన్ని కారణం అవుతాయి. కింది 7 అలవాట్లు ఉన్న వ్యక్తులు జీవితంలో అసలు ఎదగలేరని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..

Health Tips: చిన్న వయసులోనే పెద్ద వారిలా కనబడుతున్నారా? ఈ నాలుగు అలవాట్లే కొంప ముంచుతున్నాయ్..!



సేఫ్ జోన్ లో ఉండాలని అనుకోవడం..

సేఫ్ జోన్ అనేది వ్యక్తిని ఎదగనీయదు. సేఫ్ జోన్ లో ఉండే వ్యక్తులు రిస్క్ తీసుకోవాలంటే భయపడతారు. కొత్తగా ఏదైనా చేయాలన్నా ముందడుగు వేయరు. కష్టపడకుండా సుఖంగా జీవితం గడిచిపోవాలని అనుకుంటారు. ఇలాంటి అలవాట్లు ఉన్నవారు ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంటారు.

పని వాయిదా..

ఈరోజు కాకపోతే రేపు చేద్దాం ఏమవుతుందిలే.. అనే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఏదైనా ఒక పనిని చేయాలని అనుకున్నప్పుడు దాన్ని వాయిదా వేయడం వల్ల దాన్నుండి లభించే ఫలితాలు కూడా తారుమారు అవుతాయి. ఇలా వాయిదా వేసే అలవాటును ప్రోక్రాస్టినేషన్ అని అంటారు. ఈ అలవాటు ఉన్నవారు చాలా సులువుగా గొప్ప అవకాశాలు కోల్పోతారు. ఇది వ్యక్తులను సోమరిగా మారుస్తుంది.

Kidney: శరీరంలో ఈ అవయవాలలో వాపు కనిపిస్తే కిడ్నీ సమస్యలున్నట్టే.. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే..!



కొత్త విషయాల పట్ల ఆసక్తి లేకపోవడం..

కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త పనులు చేపట్టడం, కొత్త గోల్స్ నిర్థేశించుకోవడం వంటివి వ్యక్తి ఎదుగుదలకు సహాయపడతాయి. కానీ ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా, ఆసక్తి లేనట్టు ఉండేవారు జీవితంలో ఎదగలేరు.

నెగిటివ్ థింకింగ్..

ఏం జరిగినా మన మంచికే అనుకునే అలవాటు చాలామందికి ఉండదు. పైపెచ్చు చేసిన పని సరైనది కాదేమో.. తాము సరిగా చేయలేదేమో.. పని మొదలు పెట్టకుండా ఉండాల్సిందేమో.. లాంటివి ఆలోచిస్తారు. పని జరగకపోవడానికి కారణాలను బయట వెతుక్కుంటారు. ఇలాంటి నెగిటివ్ థింకింగ్ ఉంటే ఇంకోసారి తమ మీద తాము ఆత్మవిశ్వాసంతో పని మొదలుపెట్టలేరు. మొదలుపెట్టినా వైఫల్యాలే ఎదురవుతాయి.

Aluminum Foil: ఆహారం ప్యాక్ చెయ్యడానికి అల్వూమినియం ఫాయిల్ వాడచ్చా? దిమ్మతిరిగిపోయే నిజాలివీ..!



లక్ష్యాలు లేకపోవడం..

ఒక లక్ష్యాన్ని నిర్థేశించుకుని దాని కోసం కష్టపడాలి. లక్ష్యం కోసం ఎక్కడ పని మొదలు పెట్టాలి? ఎక్కడి వరకు ప్రయత్నం చెయ్యాలి అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలి. అప్పుడు ఫలితం వస్తుంది. కానీ లక్ష్యం అంటూ ఏమీ లేకుండా ఏదో జీవితం గడిచిపోతోంది కదా అనుకునేవారు జీవితంలో ఎదగలేరు.

బాధ్యతల నుండి తప్పించుకోవడం..

బాధ్యతగా ఉండటం అంటే జీవితాన్ని క్రమశిక్షణతో గడుపుతున్నారని అర్థం. బాధ్యత లేని వారు ఏ పనికి బాధ్యత వహించరు. జీవితంలో జరిగే తప్పిదాలకు, నష్టాలకు తాము బాధ్యులం కామని అనుకుంటారు. వాటిని ఇతరుల మీద, కాలం మీద తోసేస్తుంటారు. ఇలాంటి వారు జీవితంలో తప్పులు తెలుసుకోలేరు. అదే విధంగా ఉన్నత స్థాయికి ఎదగలేరు.

Pani Puri: పానీపూరి తిన్నా ఆరోగ్య లాభాలు ఉన్నాయా? ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివీ..!



మార్పుకు సిద్దంగా లేకపోవడం..

మార్పుకు సిద్దంగా ఉన్నవారు ఎలాంటి పరిస్థతులలో అయినా రాణిస్తారు. ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం పొందినట్టు మార్పుకు సిద్దపడేవారు జీవితాన్ని గొప్పగా నిర్మించుకుంటారు. కానీ మార్పు అంటే భయపడేవారు, తాము ఉన్న సర్కిల్ నుండి బయటకు రావడానికి ఇష్టపడనివారు బావిలో కప్పలా ఉండిపోతారు.

వైద్యులు చెప్పిన నిజాలు.. ఈ ఆల్కహాల్ రకాలు చాలా హెల్తీ..!

ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లికే చేయండి.

Updated Date - Jul 26 , 2024 | 03:42 PM